Paadi Koushik Reddy | ఎన్ని నోటీసులిచ్చినా వెనక్కి తగ్గను: పాడి కౌశిక్ రెడ్డి
Paadi Koushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి నన్ను లక్ష్యంగా చేసుకున్నారని, నాపై ఎన్ని కేసులు (Cases) పెట్టినా, నోటీసులు (Notice) ఇచ్చినా ప్రశ్నించే గొంతును అణచలేరని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Koushik Reddy) అన్నారు. కానీ నా కుటుంబాన్ని, మా BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం బాధ కలిగించిందన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే (Questioning) ఉంటా, నిలదీస్తూనే ఉంటా అని స్పష్టం చేశారు.
త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి నన్ను లక్ష్యంగా చేసుకున్నారని, నాపై ఎన్ని కేసులు (Cases) పెట్టినా, నోటీసులు (Notices) ఇచ్చినా ప్రశ్నించే గొంతును అణచలేరని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Koushik Reddy) అన్నారు. కానీ నా కుటుంబాన్ని, మా BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం బాధ కలిగించిందన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే (Questioning) ఉంటా, నిలదీస్తూనే ఉంటా అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
బాధ కలిగించింది..
ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా BRS కుటుంబ సభ్యులకు CID నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో నా కుటుంబ సభ్యులను, మా BRS కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా? రాజకీయాలు నాపై చేయండి.. కానీ నా కుటుంబాన్ని, మా BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు.
హామీలు నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటా..
అయినా సరే.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అప్పటివరకు ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు. ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణచలేరు. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





