త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేయ‌లేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar | పోక్సో కేసులో బండి భ‌గీర‌థ్‌ను పోలీసులు అరెస్టు చేయ‌లేదు.. లాయ‌ర్ల‌తో క‌లిసి లొంగిపోయాడు అని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేశాం.. లొంగిపోలేద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆర్ఎస్పీ తీవ్రంగా స్పందించారు.

S

Telangana | Published On May 21, 2026, 5.47 pm IST

RS Praveen Kumar | బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేయ‌లేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్ : పోక్సో కేసులో బండి భ‌గీర‌థ్‌ను పోలీసులు అరెస్టు చేయ‌లేదు.. లాయ‌ర్ల‌తో క‌లిసి లొంగిపోయాడు అని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేశాం.. లొంగిపోలేద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆర్ఎస్పీ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణించి పోతున్నాయి. రాష్ట్రంలో మైనర్ బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. పోక్సో కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అబద్ధాలు చెప్తున్నాడని, రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. పోక్సో కేసులో బండి భగీరథ్‌ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి పడుతున్న తంటాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పోక్సో కేసులో బీఆర్ఎస్ గళం ఎత్తడంతోనే భగీరథ్ జైలుకు వెళ్ళాడు. భగీరథ్‌ను అరెస్ట్ చేశామని రేవంత్ రెడ్డి అంటున్నాడు, బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ అంటున్నాడు. బండి సంజయ్ మాటలను నమ్మాలా, రేవంత్ రెడ్డి మాటలను నమ్మాలా అర్ధం కావడం లేదు. బండి భగీరథ్ లాయర్లతో కలిసి లొంగిపోయాడు, ఆయ‌న‌ను అరెస్ట్ చేయ‌లేదు. బండి భగీరథ్‌ను పట్టుకునేందుకు నాకాబంది ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని ఆర్ఎస్పీ మండిప‌డ్డారు.

రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని భరతం పట్టేందుకే..

నేను వాస్తవాలు మాట్లాడుతుంటే రిటైర్డ్ అయిన తహశీల్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అధికారిని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని భరతం పట్టేందుకు నేను ఉద్యోగం వదులుకున్న. నేను మళ్ళీ ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు లేదు. రిటైర్డ్ అయిన పోలీస్ అధికారి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటాడని ఆయ‌న తెలిపారు.

బాధితురాలి ఫొటోలు బయటపెట్టింది బీజేపీ సోషల్ మీడియానే

బాధితురాలు పేరు బయట పెట్టింది బీజేపీ, బీజేపీ నాయకులు మాత్ర‌మే. బాధితురాలు పేరు బీఆర్ఎస్ ఎక్కడ బయట పెట్టలేదు. బాధితురాలి ఫొటోలు బయటపెట్టింది బీజేపీ సోషల్ మీడియా, బీజేపీ నాయకులు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. అబద్ధాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడ‌ని పేర్కొన్నారు.

కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఉన్న మైండ్ కాస్త పోతుంది..

మైనర్ బాలిక కేసు విషయంలో కేసీఆర్ మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. పోక్సో కేసులో కేసీఆర్ ఆదేశాలతో మేము మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అవుతుంది. కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఉన్న మైండ్ కాస్త పోతుంది. మైనర్ బాలికకు అన్యాయం చేసిందే పోలీసులు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మైనర్ బాలికకు న్యాయం జరిగేలా లేదన్నారు.

బండి సంజ‌య్‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల్సిందే..

హైకోర్టు న్యాయమూర్తి భర్తపై ఒక వ్యక్తి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే అప్పటికప్పుడు అరెస్ట్ చేసినప్పుడు.. మైనర్ బాలికపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేదు. మైనర్ బాలికను, ఆమె తల్లిని బండి సంజయ్, సంగప్ప బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి. బాలిక‌ను, ఆమె త‌ల్లిని బెదిరించినందుకు సెక్షన్ 238 ప్రకారం బండి సంజయ్ నేరస్థుడు, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

బండి సంజ‌య్‌ను కాపాడ‌మ‌ని రేవంత్‌కు మోదీ చెప్పాడు..

బండి సంజయ్‌ను కాపాడమని ప్ర‌ధాని మోదీ రేవంత్ రెడ్డికి చెప్పాడు, ఇది నిజం, దీనిపై ఎక్కడైనా తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు మేము సిద్ధం. బండి సంజయ్‌పై కేసు నమోదు చేయ‌కుండా కేసును నీరుగార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మైనర్ బాలికపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మైనర్ బాలికకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మొదటి నుంచి పోరాడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు, మాధవీలత మైనర్ బాలిక కేసు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేదు, బాలికకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement