త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

J

Telangana | Published On May 21, 2026, 9.13 pm IST

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
Advertisement

Harish Rao New Jersey | త్రినేత్ర.న్యూస్ : అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) కీలక నేత హరీశ్ రావు తెలంగాణ ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. న్యూజెర్సీలోని హల్దీ- మౌంట్ లారెల్‌లో (Haldi - Mount Laurel) ఎన్నారైలు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ (Meet and Greet) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సమకాలీన అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఎన్నారైలతో ఆయన విస్తృతంగా చర్చించారు.

విజన్ లేని పాలనతో ఇబ్బందులు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రతీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణ.. కేసీఆర్ పాలనలో పంజాబ్ రాష్ట్రాన్ని మించి ధాన్యం ఉత్పత్తి చేసి రికార్డులు సృష్టించిందని అన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో విజన్ (Vision) లేని రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.

రియల్ ఎస్టేట్ ఢమాల్.. ఎన్నారైల భయం

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం కుదేలైందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఎలా ఉందంటే.. తెలంగాణలో కనీసం ఒక్క ప్లాట్ (Plot) కొనాలన్నా కూడా ఎన్నారైలు (NRIs) సైతం భయపడిపోయే వాతావరణం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు.

Harish Rao in New Jersey NRIs Afraid to Buy Plots in Telangana

జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల దవా

దేశ రాజకీయాలపై స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని హరీష్ రావు స్పష్టం చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా జాతీయ పార్టీలు సొంతంగా ఏమీ చేయలేకపోతున్నాయని, ప్రాంతీయ పార్టీలే అక్కడ చక్రం తిప్పుతున్నాయని ఆయన తేల్చిచెప్పారు.

ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు

ఈ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌కు విచ్చేసిన హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్, ఇతర ఎన్నారై ప్రతినిధులు గ్రాండ్ వెల్‌కమ్ (Grand Welcome) చెప్పారు. మహేష్ తన్నీరు, నరసింహా రావు, భాస్కర్ పిన్న, రవీందర్ రావు, అమర్ గుండ, పరమేశ్ బీం రెడ్డి, చైతన్న చిట్టిమల్ల, వరప్రసాద్, చందు తాళ్ల, పూర్ణ బైరి, నర్సింహా రెడ్డి, దొంతిరెడ్డి, రజినీ తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement
Advertisement