త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

ఎంజేపీ గురుకులాల్లో 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ శిక్షణ. 100% రిజల్ట్స్ సాధించిన స్కూల్స్‌కు అభినందనలు, వెనుకబడిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్

J

Telangana | Published On May 21, 2026, 10.30 pm IST

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
Advertisement

Ponnam Prabhakar MJP Gurukulam | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని మహాత్మా జ్యోతిరావు పూలే (MJP) బీసీ గురుకుల పాఠశాలలను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 100 శాతం రిజల్ట్స్ సాధించిన స్కూల్స్ ప్రిన్సిపాల్స్‌ను అభినందించిన మంత్రి.. ఫలితాలు తగ్గిన వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తదుపరి విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు రాబట్టాలని స్పష్టం చేశారు.

Minister Ponnam Prabhakar Reviews MJP Gurukul Results Strict Orders Issued

బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి

ఇతర రాష్ట్రాల వారు సైతం మన విద్యావిధానాన్ని చూసి నేర్చుకునేలా ఎంజేపీ (MJP) కి ఒక ప్రత్యేక "బ్రాండ్ ఇమేజ్" క్రియేట్ చేయాలని మంత్రి సూచించారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ఆటలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైన్స్ రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా 8వ తరగతి నుంచే విద్యార్థులను NEET, EAMCET వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

Minister Ponnam Prabhakar Reviews MJP Gurukul Results Strict Orders Issued

విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి

ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తోందని మంత్రి గుర్తుచేశారు. ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉన్నప్పటికీ బేసిక్ ఫెసిలిటీస్ (టాయిలెట్స్, ఫ్యాన్స్ తదితర మౌలిక సదుపాయాలు) కల్పించాల్సిన పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్స్‌దే అన్నారు. తల్లిదండ్రుల కంటే టీచర్ల దగ్గరే పిల్లలు ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి, వారిని సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. చిన్న చిన్న కారణాలతో గురుకులాల్లో జరిగే సూసైడ్స్‌ను అడ్డుకునేలా విద్యార్థుల్లో మోటివేషన్ నింపాలని, ధైర్యం కల్పించాలని సూచించారు.

Minister Ponnam Prabhakar Reviews MJP Gurukul Results Strict Orders Issued

రిజల్ట్స్‌పై సమీక్ష.. నెక్స్ట్ ప్లాన్ ఇదే

ఈ ఏడాది 10వ తరగతిలో 98.45% పాస్ పర్సంటేజ్ రాగా, 204 స్కూల్స్ 100% రిజల్ట్స్ సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ సెకండియర్‌లో 90.31%, ఒకేషనల్ సెకండియర్‌లో 97.72%, ఫస్టియర్‌లో 85.80% ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణత శాతం తగ్గిన స్కూల్స్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Minister Ponnam Prabhakar Reviews MJP Gurukul Results Strict Orders Issued

  • మంచి మార్కులు సాధించిన స్కూల్స్ ర్యాంకర్ల ఫోటోలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం కల్పించాలి.
  • ఎంజేపీలో టెన్త్ పాసైన వారికి ఇంటర్‌లో డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వాలి.
  • ప్రతి స్కూల్‌లో ఒక కంప్యూటర్ ల్యాబ్ (Computer Lab) ఏర్పాటు చేయాలి.
  • పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) తప్పనిసరి చేయాలి.

ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సెక్రటరీ సైదులు, పలువురు ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Minister Ponnam Prabhakar Reviews MJP Gurukul Results Strict Orders Issued Minister Ponnam Prabhakar Reviews MJP Gurukul Results Strict Orders Issued

Advertisement
Advertisement