త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

చీఫ్ జస్టిస్ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. సరదాగా మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

J

National | Published On May 21, 2026, 11.00 pm IST

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
Advertisement
  • సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన 'బొద్దింక' వ్యాఖ్యల నేపథ్యలో పుట్టుకొచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)
  • కేవలం వారం రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా కోటి (10 మిలియన్ల) ఫాలోవర్లతో సరికొత్త రికార్డ్
  • ఆప్ మాజీ స్ట్రాటజిస్ట్, బోస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్ అభిజీత్ దిప్కే దీనికి ఫౌండర్
  • ఇది ఫేక్ బాట్ల పనేనని విమర్శలు వస్తుండగా.. అఖిలేష్ యాదవ్ సహా పలువురు జాతీయ నేతల మద్దతు

Cockroach Janta Party | త్రినేత్ర.న్యూస్ : సోషల్ మీడియాలో (Social Media) ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు.. అదే 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party). కేవలం వారం రోజుల క్రితం పుట్టుకొచ్చిన ఈ పార్టీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా కోటి (10 Million) మంది ఫాలోవర్లను సంపాదించుకుని మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలకు సైతం చెమటలు పట్టిస్తోంది. సరదాగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏంటీ 'బొద్దింక' పార్టీ?

మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే ఈ సరికొత్త ఆన్‌లైన్ ట్రెండ్‌కు కారణం. నకిలీ డిగ్రీలు ఉన్నవారిని ఉద్దేశించి ఆయన మందలిస్తూ 'కాక్రోచ్' (బొద్దింక) అనే పదాన్ని వాడారు. అయితే, ఆయన నిరుద్యోగ యువతను ఉద్దేశించే ఈ మాట అన్నారంటూ తొలుత వార్తలు రావడం తీవ్ర దుమారం రేపింది. మరుసటి రోజే చీఫ్ జస్టిస్ దీనిపై క్లారిటీ ఇస్తూ.. తాను ఫేక్ డిగ్రీల (Fake degrees) వాళ్లనే అన్నాను తప్ప, యువతను కాదని, దేశ యువత అంటే తనకు ఎంతో గర్వకారణమని స్పష్టం చేశారు.

జోక్‌గా మొదలై.. ఉద్యమంగా!

చీఫ్ జస్టిస్ వివరణ ఇచ్చినప్పటికీ, నెట్టింట అప్పటికే 'బొద్దింకల' చుట్టూ పెద్ద చర్చే మొదలైంది. ఈ క్రమంలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న మహారాష్ట్రకు చెందిన పొలిటికల్ కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే.. మే 16న 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో ఒక పోస్టర్‌ను X (ట్విట్టర్) లో షేర్ చేశారు. "బొద్దింకలందరి కోసం ఈ కొత్త ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తున్నా.. చేరాలనుకునే వారు ఈ గూగుల్ ఫామ్ (Google Form) నింపండి" అని లింక్ ఇచ్చారు. చూస్తుండగానే లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అభిజీత్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తో పాటు కేజ్రీవాల్ ప్రభుత్వంతో కలిసి పలు కీలక ప్రాజెక్టుల్లో పనిచేశారు.

రాజకీయ నేతల మద్దతు.. బాట్ల అనుమానాలు!

కొంతమంది తృణమూల్ (TMC) ఎంపీలు తాము కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మెంబర్లమే అని సరదాగా ప్రకటించుకోగా.. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏకంగా "BJP vs CJP" అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో వారం రోజుల్లోనే కోటి మంది ఫాలోవర్లు రావడంపై నెటిజన్లు స్క్రూటినీ ప్రారంభించారు. ఎక్స్ లో పెద్దగా లేని ఫాలోయింగ్ ఇన్‌స్టాలో మాత్రమే ఎలా వచ్చిందని, ఇదంతా విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్న ఫేక్ బాట్ల (Bots) పనే అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వెనక్కి తగ్గేదే లేదంటున్న యూత్

ఈ ట్రెండ్‌పై ఫౌండర్ అభిజీత్ స్పందిస్తూ.. "మొదట దీన్ని ఒక జోక్‌గా స్టార్ట్ చేశాను. కానీ జనాల రెస్పాన్స్ చూశాక దీన్ని ఇంకెంతమాత్రం తీసిపారేయలేం. యువతను తక్కువ అంచనా వేయొద్దు. జెన్-జీ (Gen Z) యువత నాకు పర్సనల్‌గా మెసేజ్‌లు చేస్తున్నారు. 'మేం ఒక విప్లవం మొదలుపెట్టాం, ఇప్పుడు దయచేసి వెనక్కి తగ్గొద్దు' అని కోరుతున్నారు. మేం రాజ్యాంగాన్ని విశ్వసిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement