త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేటీఆర్ జ‌డ్జి.. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఐవో.. బండి భ‌గీర‌థ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్

CM Revanth Reddy | బండి భ‌గ‌రీథ్‌పై న‌మోదైన పోక్సో కేసులో కేటీఆర్ జ‌డ్జిగా, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఐవోగా వ్య‌వ‌హ‌రించార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈయ‌న విచార‌ణ చేసిండు.. ఆయ‌న శిక్ష విధించిండు.. ఎంత సిగ్గు త‌ప్పి పోయారంటే అస‌లు నాకు అర్థ‌మే అయిత‌లేదు అని రేవంత్ పేర్కొన్నారు.

S

Telangana | Published On May 21, 2026, 4.42 pm IST

CM Revanth Reddy | కేటీఆర్ జ‌డ్జి.. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఐవో.. బండి భ‌గీర‌థ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బండి భ‌గ‌రీథ్‌పై న‌మోదైన పోక్సో కేసులో కేటీఆర్ జ‌డ్జిగా, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఐవోగా వ్య‌వ‌హ‌రించార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈయ‌న విచార‌ణ చేసిండు.. ఆయ‌న శిక్ష విధించిండు.. ఎంత సిగ్గు త‌ప్పి పోయారంటే అస‌లు నాకు అర్థ‌మే అయిత‌లేదు అని రేవంత్ పేర్కొన్నారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సీఎం స‌మాధానం ఇచ్చారు.

ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు చ‌ట్టాలు ఉన్నాయి. ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేసినం.. పేరెంట్స్ స్టేట్‌మెంట్ తీసుకున్నాం. పోక్సో కేసులో ఎవ‌రి వివ‌రాలు చెప్ప‌డానికి లేదు. వాళ్ల‌లాగా రోడ్డు మీద ప‌డి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేద‌న ఉంట‌ది.. ఆ అమ్మాయి, త‌ల్లిదండ్రుల ఫొటోలు అడ్డ‌గోలుగా పెట్టారు. కేటీఆర్ మ‌నిషా..? ఎవ‌డ‌న్న మ‌నిషి ఇట్ల వ్య‌వ‌హ‌రిస్తాడా..? రాజ‌కీయాలు కావాలనుకుంటే ఎన్నిక‌ల్లో కొట్లాడు. ఎన్నిక‌ల్లో ఓడించు. రాజ‌కీయాల‌ను రాజ‌కీయాల్లాగా, స‌మ‌స్య‌ను స‌మ‌స్య‌లాగా చూడాలి. మైన‌ర్‌కు స‌బంధించిన దానికి రాజకీయాలు ఎందుకు..? ప్ర‌భుత్వం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ, రాజ‌కీయంగా ఏదో సాధించామ‌ని ఈ శాడిజం ఏంది..? ఇది శాడిస్టిక్ ప్లెజ‌ర్ కాదా..? అని సీఎం ప్ర‌శ్నించారు.

సిగ్గులేని త‌నం.. బ‌రితెగించిన త‌నం..

కేటీఆర్ బామ్మ‌ర్ది ఫామ్ హౌస్‌లో డైరెక్ట్‌గా డ్ర‌గ్స్ తీసుకుని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బామ్మ‌ర్దిని వంగ‌బెట్టి పిర్ర‌లు ప‌గ‌ల‌గొట్టండ‌ని, పోలీసు స్టేష‌న్‌కు పోయి కోదండం ఎక్కించ‌మ‌ని ఎందుకో చెప్ప‌లేదు. మా బామ్మ‌ర్ది దీపావ‌ళి పండుగ చేసుకుంటుండు.. చిచ్చుబుడ్ల బ‌దులు సారాబుడ్లు పెట్టుకున్న‌డు. బంతిపూల బ‌దులు గంజాయి, కొకైన్ పెట్టుకున్న‌డు. ఎట్ల అరెస్టు చేస్తున్నార‌ని బ‌య‌ట‌కొచ్చి మాట్లాడిండు క‌దా..? ఈ సిగ్గులేనోడు. బామ్మ‌ర్ది ఫామ్ హౌస్‌లో డ్ర‌గ్స్‌తో దొరికితే కేసు కాదు.. ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాల‌తో దొరికిండు. దాని మీద లేదు. ఇవాళ నేను చెబుతున్నా అధికారికంగా దుబాయ్‌లో చ‌నిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీల‌తో, వాళ్ల మాజీ ఎమ్మెల్యే వాళ్ల ఫామ్ హౌజ్‌లో డ్ర‌గ్స్‌తో పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చ‌ట్టాన్ని గౌర‌వించి స‌మాజాన్ని ఉద్ధ‌రించే కేటీఆర్ యేడ ప‌డుకుండు. ఏ బొక్క‌లో ప‌డుకుండు. వాళ్ల‌ను ఎందుకు పార్టీల నుంచి స‌స్పెండ్ చేయ‌లేదు.. ఎంత సిగ్గులేని త‌నం, బ‌రితెగించిన త‌నం. ఇంత‌కంటే సిగ్గు త‌ప్పినోడు ఎవ‌డైనా ఉంటాడా..? సిగ్గు లేకుండా మాట్లాడిండు.. నిన్న గాక మొన్న బెయిల్ వ‌చ్చింది ఫామ్ హౌస్‌లో డ్ర‌గ్స్‌తో దొరికినోడికి. ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌లేదు.. స‌స్పెండ్ చేయ‌లేదు.. ప్ర‌త్య‌క్షంగా పార్టీలో ఉన్నోడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే దాని గురించి మాట్లాడ‌డు. జాతిర‌త్నం, అమాయ‌కుడిలా క‌నిపిస్తాడ‌ట‌. ఇవ‌త‌ల పిల్ల‌ల‌పై చ‌ట్ట ప్ర‌కారం ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకున్నాం.

కేటీఆర్ ఏమైనా స‌ర్టిఫికేట్ ఇచ్చే అథారిటీనా..?

కేటీఆర్ బామ్మ‌ర్ది ఫామ్ హౌజ్‌లో డ్ర‌గ్స్ దొరికినా.. నోటీసు ఇచ్చాం పీఎస్‌కు వ‌చ్చి విచార‌ణ ఎదుర్కోవాలి అని. పోక్సో కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న బండిభ‌గీర‌థ‌కు కూడా ఇంటికెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారు కొంత స‌మ‌యం కావాల‌ని అడిగారు. బాధితురాలు మైన‌ర్, మేజ‌ర్ అని నిర్ధారించుకునేందుకు ప్ర‌భుత్వ‌ రికార్డులు సేక‌రించాం. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అని ఎవ‌రు నిర్ధారించాలి. కేటీఆర్ ఏమైనా స‌ర్టిఫికేట్ ఇచ్చే అథారిటీనా..? ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఏమైనా ఐవోనా..? టెన్త్ స‌ర్టిఫికెట్, బ‌ర్త్ స‌ర్టిఫికెట్, ఆధార్ కార్డుతో మైన‌ర్ అని నిర్ధారించుకున్న త‌ర్వాత‌.. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌ట్టాం. కోర్టు కూడా మ‌మ్మ‌ల్ని త‌ప్పుప‌ట్ట‌లేదు. కేవ‌లం కేటీఆర్ కోర్టులోనే త‌ప్పుప‌డుతున్నారు. నీతులు చెప్ప‌డానికే బాగుంటాయి.. మాట్లాడొద్ద‌ని మీరు కూడా చెప్పండి అని జ‌ర్న‌లిస్టుల‌కు సీఎం స‌ల‌హా ఇచ్చారు.

ఆ చ‌ట్టాన్ని స‌వ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది..

చ‌ట్టం ప్ర‌కారం చేయాల్సిందే.. కానీ చ‌ట్టంలోని లొసుగుల‌ను వారు వాడుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే జైలుకు పంపిస్తున్నాం. గంజాయి, కొకైన్ కొట్టి దొరికితే అత‌ను బాధితుడు కాబ‌ట్టి స్టేష‌న్ బెయిల్ ఇవ్వాల‌ని చ‌ట్టంలో ఉంది. ఏం చేయాల్నో మీరు చెప్పండి. కేటీఆర్, ఆయ‌న బామ్మ‌ర్ది చ‌ట్టంలో ఉన్న వెసులుబాటును వారు వాడుకుంటున్నారు. ఆ చ‌ట్టాన్ని స‌వ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది అని రేవంత్ రెడ్డి అన్నారు.

సున్నిత‌మైన స‌మ‌స్య‌ను సున్నితంగా ప‌రిష్క‌రించాం..

ఏ కేసులో అయినా పోలీసుకు ఒక ప్రోసిజ‌ర్ ఉంది. ఫిర్యాదు వ‌చ్చిన వెంట‌నే ఎఫ్ఐఆర్ చేయాలి. ఆ త‌ర్వాత 24 గంట‌ల్లో ఆ అమ్మాయి స్టేట్‌మెంట్ రికార్డు చేయాలి. అమ్మాయి త‌ల్లిదండ్రులు వ‌చ్చి ఫిర్యాదు చేయ‌క ముందే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు క‌రీంన‌గ‌ర్‌లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్‌లో అమ్మాయి మైన‌ర్ కాదు మేజ‌ర్ అని ఒక వివాదాన్ని తెర‌లేపారు. ఆమె మైనరా.. మేజ‌రా అని ప్ర‌భుత్వం ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న ఉన్న‌ప్పుడు ఆ ఇంటి మీదికి ఓ వెయ్యి మంది పోలీసుల‌ను పంపితే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌తో మా పార్టీ ఆకాశ‌మంతా ఎత్తుకు ఎగిరింది. తెలంగాణ‌లో మొత్తం గెలిచిపోతుంది. క‌క్ష సాధింపు చ‌ర్య‌ల కింద పోలీసుల‌ను పంపిచార‌ని ఆయ‌న రెడీగా కూర్చొన్నాడు. సున్నిత‌మైన స‌మ‌స్య‌ను సున్నితంగా ప‌రిష్క‌రించాం. సెక్ష‌న్‌న్ల‌లో, అరెస్టులో, రిమాండ్‌లో, వాద‌న‌లో లోపం ఉందా.. ఎక్క‌డుందో చెప్పండి అని సీఎం ప్ర‌శ్నించారు.

కేటీఆర్, బండి సంజ‌య్‌కు పంచాయితీ ఉంది..

ఒక్క‌టే కేటీఆర్, బండి సంజ‌య్‌కు పంచాయితీ ఉంది. ఆ పంచాయితీని ఈ పిల్ల‌ల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాల‌నుకుంటే, ఆర్ఎస్ ప్ర‌వీణ్ ఉద్యోగం పోయింది కాబ‌ట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతూ నేనే విచార‌ణ అధికారిని అని ఆయ‌న ఇంకా భ్ర‌మ‌ల్లో ఉన్న‌ట్టున్నాడు. ఆయ‌న తీసేసిన త‌హ‌సీల్దార్.. ఆయ‌న‌కు ఇంకా అర్థ‌మైత‌లేదు అని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

Advertisement
Advertisement