త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CID Notice to Koushik Reddy | పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. ఏప్రిల్ 4న విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశం

CID Notice to Koushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Koushik Reddy) కి సీఐడీ (CID) నోటీసులు (Notice) జారీ (issued) చేసింది. గ‌త జనవరి 29న సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కేసు నమోదు (Case file) చేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్ లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

S

News | Published On Mar 31, 2026, 12.43 pm IST

CID Notice to Koushik Reddy | పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. ఏప్రిల్ 4న విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హుజూరాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Koushik Reddy) కి సీఐడీ (CID) నోటీసులు (Notice) జారీ (issued) చేసింది. గ‌త జనవరి 29న సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కేసు నమోదు (Case file) చేశారు. ఈ కేసును పోలీసులు సీఐడీకి అప్పగించారు. దీంతో ఏప్రిల్ 4న హైదరాబాద్ లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

BNSS సెక్షన్ 35(3) కింద విచారణ నోటీసు జారీ చేసినట్లు సీఐడీ విచార‌ణ అధికారి ఎన్ సీహెచ్ రంగ‌స్వామి తెలిపారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో 30/2026 నంబ‌ర్‌తో కేసు న‌మోదైన‌ట్లు చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో రోడ్డు మీద కూర్చుని ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడ‌మే కాకుండా, ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌లిగించారు. దీంతో పాటు పోలీసుల విధులకు అడ్డుప‌డ‌డ‌మే కాకుండా అధికారులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినట్టు కేసు న‌మోదైంద‌న్నారు.

ఏప్రిల్ 4న హాజ‌రు కండి..

ఏప్రిల్ 4న ఉదయం 11:30కు హాజరు కావాలని సీఐడీ కౌశిక్‌రెడ్డిని ఆదేశించింది. గుర్తింపు పత్రాలు, సంబంధిత డాక్యుమెంట్లు వెంట తీసుకురావాలని సూచించింది. ఎట్టిప‌రిస్థితుల్లో సాక్ష్యాలను ప్ర‌భావితం చేయొద్ద‌ని.. నోటీసును పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు త‌ప్ప‌వ‌ని సీఐడీ అధికారులు హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement