త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

K Srinivas Reddy | 21 మంది జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌కు ఆర్థిక సాయం: మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కే శ్రీ‌నివాస్‌రెడ్డి

K Srinivas Reddy | జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21 మందికి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్థిక సహాయం కోసం వచ్చిన 29 దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి ఆర్థిక సహాయం మంజూరు చేసిందన్నారు.

S

Hyderabad | Published On May 21, 2026, 5.47 pm IST

K Srinivas Reddy | 21 మంది జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌కు ఆర్థిక సాయం: మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కే శ్రీ‌నివాస్‌రెడ్డి
Advertisement

K Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21 మందికి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వ‌హించారు. ఆర్థిక సహాయం కోసం వచ్చిన 29 దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, తీవ్ర ప్రమాదాలకు గురైన, దీర్ఝకాలికంగా అనారోగ్యం బారిన పడిన నలుగురు జర్నలిస్టులకు కమిటీ ఆర్థిక సహాయం మంజూరు చేసిందన్నారు.

మరణించిన 17 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌న్నారు. ఆయా కుటుంబాలకు ప్రతి నెలా మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్.కే.జి నుండి పదో తరగతి వరకు చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు. నలుగురు అనారోగ్యం బారిన పడిన వర్కింగ్ జర్నలిస్టులకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కమిటీ సమావేశంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, మేనేజర్ డి.ఆర్.ఎస్. శైలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement