Football Championship | హైదరాబాద్‌లో నేడు ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ప్రారంభం
Football Championship | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 74వ బీఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2025-26 (All India Police Football Championship 2025-26) పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Football Championship | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 74వ బీఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2025-26 (All India Police Football Championship 2025-26) పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలి (Gachibowli)లోని జీఎంసీ బాలయోగి స్టేడియం (GMC Balayogi Stadium)లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రారంభ వేడుకలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించనున్నారు. ఏప్రిల్ 5 వరకు మొత్తం 12 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీస్ బలగాలు, కేంద్ర పారామిలటరీ దళాల నుంచి మొత్తం 43 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 34 పురుషుల జట్లు, 9 మహిళా జట్లు ఉన్నాయి. మొత్తం 1038 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. వీరిలో 851 మంది పురుషులు కాగా, 187 మంది మహిళలు ఉన్నారు.
నగరంలోని గచ్చిబౌలి స్టేడియం, గోల్కొండ హెచ్‌ఎఫ్‌సీ స్టేడియం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ గ్రౌండ్, శ్రీనిధి ఫుట్‌బాల్ స్టేడియం, గోల్కొండ ఆర్టిలరీ గ్రౌండ్స్‌లో మొత్తం 110 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవంలో జట్ల కెప్టెన్ల ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్ నిర్వహించి గవర్నర్‌కు గౌరవ వందనం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్, ఆసియా కప్ మహిళా జట్టు క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, మాజీ భారత కోచ్ నయీముద్దీన్ పాల్గొననున్నారు. ఇక ఏప్రిల్ 5న జరిగే ముగింపు వేడుకలో విజేతలకు ట్రోఫీలు అందజేయనున్నారు. ఈ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం ఉండటంతో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని డీజీపీ సూచించారు.
Also Read..
హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. ఆటోల బంద్‌తో ఉద్యోగుల అవస్థలు
28లోగా ఆ రెండు బంగ్లాలను ఖాళీ చేయండి.. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నోటీసులు
గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు.. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజులు ఆగాల్సిందే
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
జులై 9, 2026

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
జులై 9, 2026

Student Missing | చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..
- ●JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్
- ●Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్
- ●Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ
- ●Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..

JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్

Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్

Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ



