త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | ఖ‌మ్మంలో హైడ్రామా.. క‌విత దీక్ష‌ను భ‌గ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

Kalvakuntla Kavitha | ఖ‌మ్మం (Khammam)లో హైడ్రామా చోటు చేసుకుంది. న‌గ‌ర శివారు వెలుగుమ‌ట్ల (Velugumatla) భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) పోలీసులు అరెస్ట్ చేశారు.

D

Telangana | Published On Mar 10, 2026, 12.33 pm IST

Kalvakuntla Kavitha | ఖ‌మ్మంలో హైడ్రామా.. క‌విత దీక్ష‌ను భ‌గ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement

Kalvakuntla Kavitha | ఖ‌మ్మం (Khammam)లో హైడ్రామా చోటు చేసుకుంది. న‌గ‌ర శివారు వెలుగుమ‌ట్ల (Velugumatla) భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో కలిసి క‌విత నిరాహార దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ దీక్ష‌ను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. క‌విత‌ను అరెస్ట్ చేశారు. కవిత సహా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం వారంద‌రినీ అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ తీరుపై క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భూదాన్‌ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని మండిప‌డ్డారు. త‌న‌ను అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి, కూల్చివేతలు జరిగిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు.

https://x.com/ANI/status/2031232131951952286

Also Read..

Trump Advisers Urge Exit Plan From Iran War | యుద్ధం నుంచి వైదొలుగుదాం.. ట్రంప్‌పై సలహాదారుల ఒత్తిడి

Gas Supply | రంగాల వారిగా గ్యాస్ స‌ర‌ఫ‌రా కేటాయింపుల‌ను ప్ర‌క‌టించిన కేంద్రం

Lavanya Tripathi | సోష‌ల్ మీడియాలో మెగా కోడ‌లిపై అస‌భ్య కామెంట్లు

Advertisement
Advertisement