Lavanya Tripathi | సోషల్ మీడియాలో మెగా కోడలిపై అసభ్య కామెంట్లు
సోషల్ మీడియా వేధింపులపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తనతో పాటు కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి అసభ్య కామెంట్లు, పోస్టులు పెడుతున్నాడని కంప్లైంట్‌లో పేర్కొన్నది.
Entertainment | Published On Mar 10, 2026, 11.34 am IST
Lavanya Tripathi | సోషల్ మీడియా వేధింపులపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకొని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అసభ్య కామెంట్లు, పోస్టులు పెడుతున్నాడని తన ఫిర్యాదులో లావణ్య త్రిపాఠి పేర్కొన్నది. పర్పుల్ క్రెయాన్00 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన పరువుకు భంగం కలిగించేలా పోస్ట్‌లు, గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని లావణ్య త్రిపాఠి అన్నది.
చర్యలు తీసుకోవాలి...
ఇన్‌స్టా ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించడమే కాకుండా చట్టపరంగా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇన్‌స్టాలో తనను ఉద్దేశించి పెట్టిన పోస్టులను తొలగించాలని కోరింది. లావణ్య త్రిపాఠి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐటీ యాక్ట్ 67తో పాటు బీఎన్ఎస్ 78, 79 కింద కేసులు నమోదు చేశారు. విచారణ జరుపుతోన్నారు.
సతీలీలావతితో రీఎంట్రీ...
కాగా మెగా హీరో వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది లావణ్య త్రిపాఠి. సతీలీలావతి మూవీతో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుంది. మార్చి 6న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది. ఈ నెలలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు. ఈ క్రైమ్ కామెడీ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Lavanya Tripathi | థియేటర్లలో రిలీజై రెండు వారాలు కాకముందే ఓటీటీలోకి మెగా కోడలు మూవీ – భర్తను కట్టేసి కొడితే…
మే 16, 2026

Chiranjeevi | ముగ్గురు కలిసి రఫ్ఫాడించేశారు – పెద్ది ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ – డైలాగ్ లీక్
మే 16, 2026

Avika Gor | ఫారిన్లో ఇళ్లు కొన్న టాలీవుడ్ హీరోయిన్ – సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?
మే 10, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



