Stephen Ravindra | 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉంది : సివిల్ సప్లై కమిషనర్
Stephen Ravindra | తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లై కమిషనర్ (Telangana Civil Supplies Commissioner) స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) స్పష్టం చేశారు. సుమారు 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని చెప్పారు.
Stephen Ravindra | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లై కమిషనర్ (Telangana Civil Supplies Commissioner) స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) స్పష్టం చేశారు. ఇంధన కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేయొద్దని తెలిపారు. నిన్న ఒక్కరోజే సుమారు 1,500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను బంక్‌లకు పంపిణీ చేసినట్లు చెప్పారు. సుమారు 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని చెప్పారు. రోజువారి అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు.
పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ..
కాగా, హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు బంకుల (petrol pumps) వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఏకంగా పెద్ద పెద్ద క్యాన్‌లకు పెట్రోల్ నింపుకుని వెళ్తున్నారు. అదే సమయంలో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రాత్రి నుంచే నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం కూడా ఆఫీసులకు వెళ్లే వాళ్లు (employees) ఉదయం నుంచే పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు.
రాష్ట్రంలో ఇంధన కొరత లేదు..
ఈ నేపథ్యంలో పెట్రోల్ కొరత రాబోతుంది అంటూ ప్రచారం.. బంకుల దగ్గర వాహనాల రద్దీ పెరగడంపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది తప్పుడు వార్తలతో ప్రజలు ఆందోళనతో బంకులకు వస్తున్నారని.. దీనివల్ల విక్రయాలు సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు పెరిగినట్లు తెలిపింది. విపరీతమైన రద్దీ వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు అయిపోతున్నాయని.. వాస్తవంగా ఎలాంటి ఇంధన కొరత లేదని ప్రకటించింది. HPCL, IOCL, BPCL పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిలువలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది ఆందోళనతో ఫుల్ ట్యాంక్ చేయించకుండా.. అవసరాలకు తగ్గట్టుగానే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయమని సూచించింది. క్యాన్లు, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ కొని స్టాక్ పెట్టుకోవద్దని, అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
సీఎం రేవంత్ కీలక భేటీ
రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహిస్తారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read..
ఇంధన నిల్వలపై కేంద్రంతో సమన్వయం చేసుకోని రాష్ట్ర సర్కార్: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : తలసాని శ్రీనివాస్ యాదవ్
సిరిసిల్ల నేతన్నలను విద్యుత్ సంక్షోభం నుంచి కాపాడండి: కేటీఆర్
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



