త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | ఇంధన నిల్వలపై కేంద్రంతో స‌మ‌న్వ‌యం చేసుకోని రాష్ట్ర స‌ర్కార్‌: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

KP Vivekananda | పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Mar 25, 2026, 12.14 pm IST

KP Vivekananda | ఇంధన నిల్వలపై కేంద్రంతో స‌మ‌న్వ‌యం చేసుకోని రాష్ట్ర స‌ర్కార్‌: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Advertisement

KP Vivekananda | త్రినేత్ర‌.న్యూస్‌: పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదని విమ‌ర్శించారు. అవసరాలకు అనుగుణంగా స్టాక్స్ పెట్టుకుని ఉంటే ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే డాక్ట‌ర్ కే.సంజ‌య్‌తో క‌లిసి ఆయ‌న మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో చూశామ‌ని, ఇప్పుడు ఇంధన కొరతను చూస్తున్నామన్నారు.

ఇంధన నిల్వలపై కేంద్రతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవడం లేదని విమర్శించారు. యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఇబ్బంది లేదు కానీ.. ఇత‌ర‌ దేశాలు మాత్రం ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. కొరతను ముందుగా ఊహించలేకపోవడమే స‌మ‌స్య‌కు కార‌ణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ లేకపోతే పొద్దుగడవదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం మోపుతూ కాలం గడుపుతున్నారని మండిప‌డ్డారు. సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.

ఇప్ప‌టివ‌ర‌కు సీఎం రేవంత్ 70 సార్లు ఢిల్లీ వెళ్లివ‌చ్చార‌ని ఎమ్మెల్యే డాక్టర్ కే .సంజయ్ విమ‌ర్శించారు. అయినా గ్యాస్, పెట్రోల్, డీజిల్ తీసుకురాలేదన్నారు. ప్రజల్లో భయాందోళనకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంద‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లుగా ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించాల‌న్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement