Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
Revanth Reddy | హైదరాబాద్ నగరంలోని ఎకో పార్కులన్నింటిని గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి తేవాలన్నారు. టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
- దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటకంగా తీర్చిదిద్దాలి
- యాదాద్రి తరహాలో వికారాబాద్ వీరభద్ర స్వామి ఆలయాన్ని తయారు చేయాలి
- పర్యాటక శాఖ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ నగరంలోని ఎకో పార్కులన్నింటిని గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి తేవాలన్నారు. టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో పర్యాటక శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

తారామతి బారామతిని టూరిజం ప్లేస్‌గా మరింత అభివృద్ధి చేయాలి. మంజీరా, దిల్ కుషా గెస్ట్‌హౌస్‌లను ఆధునీకరించాలి. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. యాదాద్రి తరహాలో ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలి. క్యూర్ పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలి. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలి. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలి. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ ల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకొని పనులను ముమ్మరం చేయాలి అని సీఎం అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్ మళ్లించి అవకాశం కల్పించాలి..
పురానాపూల్ హెరిటేజ్ వంతెనలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలి. అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలి. డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పై కసరత్తు ప్రారంభించాలి. సమ్మిట్ కోసం డిపార్ట్‌మెంట్‌ల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలి అని సీఎం రేవంత్ సూచించారు.
ఈ సందర్భంగా పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి అధికారులను ఆరా తీశారు. వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మంట్ సమ్మిట్‌పై కసరత్తును ప్రారంభించాలని చెప్పారు. ఈ సమ్మిట్ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



