Break fast Scheme | స్కూల్ విద్యార్థులకు పాలు, రాగిజావ.. ఇంటర్ విద్యార్థులకు ఆహారం
Break fast Scheme | రాష్ట్రంలోని ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. స్కూల్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. ఇంటర్ విద్యార్థులకు లంచ్ ఉచితంగా అందించనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Break fast Scheme | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. స్కూల్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. ఇంటర్ విద్యార్థులకు లంచ్ ఉచితంగా అందించనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ రెండు పథకాలను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం:
2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగిజావ అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇంటర్ విద్యార్థులకు లంచ్ :
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. కౌమారదశ అనేది ఎంతో కీలకమైన దశ, ఈ వయసులో తీసుకునే పోషకాహారమే వారి నేర్చుకునే సామర్థ్యాన్ని, దీర్ఘకాలిక ఆయుష్షుని నిర్ణయిస్తుంది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?





