KTR | వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్
KTR | వేణుకుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మదిర నియోజకవర్గానికి చెందిన వేణుకుమార్ రాసిన లెటర్‌పై సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్: వేణుకుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మదిర నియోజకవర్గానికి చెందిన వేణుకుమార్ రాసిన లెటర్‌పై సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ లేఖ అందకుంటే నేనే సీఎం రేవంత్‌కు కొరియర్‌లో పంపిస్తానని స్పష్టం చేశారు. ప్రజలు, యువత మిమ్మల్ని ఏం చేయాలో చెప్పాలని నిలదీశారు. విద్యార్థులు తనువులు చాలించొద్దని కోరారు.
కాంగ్రెస్, బీజేపీలకు అలవాటైపోయింది..
రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న యువత ఒక రకమైన ఆవేదనలో ఉన్నారు. కళ్లుండి చూడగలిగిన వాళ్లకు, మనసు ఉండి అర్థం చేసుకొనే వాళ్లకు స్పష్టంగా అర్థమైతుంది. అధికారంలో ఉన్నవారికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. యువతను ప్రచారాస్త్రంగా మలచుకోవడం, రాజకీయంగా వారిని వాడుకోవడం, ఎన్నికలు దాటినంక వారిని నట్టేటా ముంచడం వంటివి కాంగ్రెస్, బీజేపీలకు అలవాటైపోయింది. కాంగ్రెస్ సర్కార్ ఎంత ప్రచారం చేసింది.. ఎంత ఆవేశపడ్డదో మనందరికి తెలుసు.
చట్ట సభలకు గౌరవం ఉండాలి కదా?
ఇవాళ విచిత్రమైన పరిస్థితి. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మాకు కూడా క్యాలెండర్‌లు ఇచ్చారు. ఇందులో ఏం లేదని మేం అదేరోజు చెప్పినం. సరిగ్గా రెండేళ్లు అయింది. డిక్లరేషన్ల పేరిటి ప్రచారంతో ఉదరగొట్టారు. చట్ట సభలకు గౌరవం ఉండాలి కదా? ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తమని రాహుల్‌గాంధీ చెప్పారు. ఇవ్వనందుకు నిరసనగా ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, కొత్త లక్ష్మిపురం గ్రామానికి చెందిన గడ్డ వేణుకుమార్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అందులో ప్రభుత్వ వైఫల్యం గురించి స్పష్టంగా రాసిండు. మదిర నియోజకవర్గ పరిస్థిపై రెండు పేజీలు లేఖ రాసిండు.
పోలీసు 20 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఎందుకియ్యరని అడిగితే సీఎం రేవంత్ ఎండ్రిన్ తాగి సావండి అని సమాధానమిచ్చిండు. బాధ్యత ఉన్న సీఎం అలా మాట్లాడితే యువత ఏం చేయాలని నేన్ అడుగుతున్నా?
బీఆర్ఎస్ హయాంలో కల్పించిన ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా అని కూడా ఆ లేఖలో రాసిండు తమ్ముడు. గ్రూప్-1 పేపర్ లీక్ అయిందని మమ్మల్ని కూడా నిందించాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.

పరామర్శకు పోతామంటే పోనివ్వరు. పువ్వాడ అజయ్ ఇతర నాయకులు ఆంక్షలను చేదించి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఈరోజు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నరు? ఎందుకు రారు? హైదరాబాద్ ఎందుకు రారు? మీరు అపాయింట్ చేసిన సీఎం ఎండ్రిన్ తాగి చావండి అని అంటుంటే మీరు ఉలకరు? పలకరు? క్రిమినల్ వేస్ట్ అని ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచిండు రేవంత్. ఇదంతా ఏందని రాహుల్‌ను అడిగితే సప్పుడు చేయడు. ఎక్కడెక్కడనో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు. గవర్నమెంట్ ఉన్నదగ్గరకు రాడు. అధికారంలోకి రావడానికి ప్రగల్భాలు పలికారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పది పాసైతే పది వేలు, 12వ తరగతి పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే 25 వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే లక్ష రూపాయలు, పీహెచ్‌డీ చేస్తే ఐదు లక్షలు అని చెప్పిన రేవంత్, భట్టి గారు ఏమైందో చెప్పాలి. మీ నియోజకవర్గం నుంచి విద్యార్థి సూసైడ్ నోట్ రాస్తే ఎందుకు స్పందించరు అని కేటీఆర్ మండిపడ్డారు.
యూత్ డిక్లరేషన్ అని ఎక్కడైతే వాళ్లు మీటింగ్ పెట్టారో మేం కూడా అక్కడే పెట్టి గుర్తు చేశాం. నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. ఒక్క హామీ అమలు కాలే. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని అడిగితే 16978 ఉద్యోగాలు ఇచ్చినం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అందులో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను తీసేస్తే 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 50 శాతం టైం గడిచిన తర్వాత కూడా 10 వేల ఉద్యోగాలు దాటలే. ఇచ్చిన హామీ ఏమో రెండు లక్షల ఉద్యోగాలు అని విమర్శించారు.
ప్రజలు, యువత మిమ్మల్ని ఏం చేయాలి, ఎట్ల చేయాలి అని నేన్ అడుగుతున్నా. వేణు రాసిన సూసైడ్ నోట్ రేవంత్‌కు అందిందో లేదో తప్పకుండా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సమాధానం చెప్పే సత్తా ఉందా? ఒకవేళ లెటర్ రేవంత్‌కు చేరకపోతే కొరియర్‌లో పంపించే బాధ్యత తీసుకుంటా. ఆయన ఆ ఆవేదన చదువుకోవాలి. నా తల్లి మానసిక వికలాంగురాలు అని రాశాడు.. చాలా బాధేసింది. 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. తప్పకుండా మళ్లీ వస్తాం. యువతకు ఉద్యోగాలు ఇస్తాం. దయచేసి తనువులు చాలించకండి అని కేటీఆర్ యువతకు విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు



