Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనగానే గంభీరమైన వ్యక్తిత్వం గుర్తొస్తుంది. కానీ ఆయనలో అద్భుతమైన హాస్య చతురత దాగుంది. తన పెళ్లి గురించి ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలివే.
సంక్షిప్త సారాంశం
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.. జయశంకర్ సార్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో జయశంకర్ సార్‌కు జరిగిన ఓ ఫన్నీ సంభాషణను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ కోసమే పెళ్లి చేసుకోలేదన్న ప్రచారాన్ని నవ్వుతూనే సున్నితంగా తిరస్కరించిన సార్ గొప్పతనాన్ని దేశపతి కొనియాడారు.
Prof Jayashankar Birth Anniversary | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ (Prof. Jayashankar) సార్ అంటే అందరికీ ఆయన పోరాట పటిమ, నిక్కచ్చిగా మాట్లాడే గంభీరమైన వ్యకిత్వమే గుర్తుకొస్తాయి. కానీ, ఆయనలో ఎవరికీ పెద్దగా తెలియని అద్భుతమైన హాస్య చతురత కూడా ఉంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) పాల్గొని ఆయనతో ఉన్న పాత జ్ఞాపకాలను, ఫన్నీ సంఘటనలను గుర్తుచేసుకుని అందరినీ ఆకట్టుకున్నారు.
టీ వద్దు.. కప్పు షుగర్ ఇవ్వండి
ఒకసారి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar).. జయశంకర్ సార్ కలిసి ఎయిర్‌పోర్టులో (Airport) దిగారు. అప్పుడు సంతోష్.. "సార్ చాయ్ తాగుతారా? విత్ షుగరా (With sugar), వితౌట్ షుగరా?" అని అడిగారు. దానికి జయశంకర్ సార్ వెంటనే తనదైన శైలిలో.. "ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో - టీ లేకుండా కప్పు షుగర్ కూడా తినగలను" (I can take a cup of sugar without tea also) అని ఫన్నీగా సమాధానం ఇచ్చారట. ఈ మాటలు వినగానే అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
పెళ్లి చేసుకోకపోవడానికి తెలంగాణే కారణమా?
అదే క్రమంలో సంతోష్ మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "సార్ మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? తెలంగాణ కోసమే మీరు వివాహానికి దూరంగా ఉన్నారని అంటుంటారు నిజమేనా?" అని అడిగారు. దానికి సార్ స్పందిస్తూ.. "అయ్యా అదేం లేదయ్యా.. అట్లా అనకు. జీవితంలో ఏదో అలా జరిగిపోయింది.. ఆలస్యం అయింది అంతే" అని సమాధానం ఇచ్చారు. తాను చేసిన త్యాగానికి అనవసరమైన కీర్తిని ఆపాదించుకోవడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడలేదని దేశపతి శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చాక సంబంధాలు చూస్తావా?
అంతటితో ఆగకుండా జయశంకర్ సార్.. "మరి రేపు పొద్దున తెలంగాణ వచ్చినంక నాకు ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తావా?" అని సంతోష్‌ను ఆటపట్టించారట. ఇలా ఎంతో సింపుల్‌గా, అందరితో చాలా ప్రేమగా ఉండే వ్యకిత్వం జయశంకర్ సార్ సొంతం అని దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో (Telangana movement) ఆయన పోషించిన కీలక పాత్రను, మార్గనిర్దేశకత్వాన్ని ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్మరించుకున్నారు.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే.. అప్పటి వరకు రేవంత్‌ను వదిలిపెట్టం : కేటీఆర్
సెప్టెంబర్ 7, 2026

Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
సెప్టెంబర్ 7, 2026

Sabitha Indra Reddy | అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు



