BRS | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన
BRS | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు (Six Guarantees) చట్టబద్ధత కల్పించాలని, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ (Gun Park) వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
BRS | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు (Six Guarantees) చట్టబద్ధత కల్పించాలని, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ (Gun Park) వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వరి పంటకు ప్రతి ఎకరాకు రూ.500 బోనస్, ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల బాకీపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వ హామీల అమలుపై పాటల రూపంలో నిరసన తెలిపారు. అనంతరం ప్లకార్డులతో అసెంబ్లీకి ర్యాలీగా వేళ్లారు.

జేమ్స్ బాండుల్లా బాండు పేపర్లు రాసిచ్చారు..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మూడో బడ్జెట్‌లో కూడా ఆరు గ్యారెంటీలపై చట్టబద్ధత కల్పించలేదన్నారు. ఎన్నికల సమయంలో హామీల అమలుపై కాంగ్రెస్ నేతలు జేమ్స్ బాండు లాగా బాండ్ పేపర్స్ రాసిచ్చారని గుర్తుచేశారు. గ్యారంటీ కార్డులు ఇచ్చి నూరు రోజులు భద్రంగా పెట్టుకోవాలని, నూటా ఒకటవ రోజు మావాళ్లు వస్తారు, ప్రతీదీ అమలు చేస్తారని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడ మీద ఉన్నట్లు ఓడ మల్లన్న, ఒడ్డు కెక్కినంక బోడ మల్లన్న అన్నట్టు.. మూడో బడ్జెట్‌లో కూడా గ్యారంటీ అన్న మాటలేకుండా, డిక్లరేషన్ అని లేకుండా ఇవాళ కాంగ్రెస్ సర్కార్ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నదని విమర్శించారు.
బలహీన వర్గాలకు లక్షకోట్ల బడ్జెట్ అన్నారు.. ఇది మూడో బడ్జెట్. ఇప్పటికే రూ.60 వేల కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాలి. కానీ, మూడు బడ్జెట్లలో కలిపితేకూడా రూ.20 వేల కోట్లు దాటట్లేదు. హామీల అమలుపై ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తున్నామని.. కాంగ్రెస్ మోసాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలోని 5 లక్షల మంది దివ్యాంగులు, 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరఫున రూ.4 వేల పెన్షన్ ఎప్పుడిస్తారని అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రూ.2500 మహాలక్షి ఎప్పుడు వస్తదా అని ఎదురుచూస్తున్న మహిళల పక్షాన ప్రశ్నిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే వదిలిపెట్టేది లేదన్నారు. మీరు రాసిచ్చిన బాండు పేపర్లు నేడు నీటిమీద రాతలయ్యాయని, నీటి మూలయ్యాయి తప్ప ఏమీకాలేదన్నారు. సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతుబంధు.. ఉగాది దాటినా ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు అంటూ మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని అడుగుడుగునా ప్రశ్నిస్తామని చెప్పారు.
https://x.com/BRSparty/status/2034879535028871264
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?






