Bhatti Vikramarka | తెలంగాణలో పెట్టుబడులు పెడితే.. ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానంతో అనుమతులిస్తాం
Bhatti Vikramarka | రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానం ద్వారా సత్వర అనుమతులు మంజూరు చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వారు చేపట్టే ప్రతి పారిశ్రామిక, సామాజిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు.
- ATA జాతీయ మహాసభల్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానం ద్వారా సత్వర అనుమతులు మంజూరు చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వారు చేపట్టే ప్రతి పారిశ్రామిక, సామాజిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో సోమవారం జరిగిన 19వ ATA జాతీయ మహాసభల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎన్ఆర్ఐలు తమ సొంత రాష్ట్రం, గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే స్పష్టమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్..
లండన్ థేమ్స్ నది తరహాలో 56 కిలోమీటర్ల మూసీ నది ప్రక్షాళన, ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఆవల రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. సామాన్య కుటుంబాల విద్యార్థులను ప్రపంచ స్థాయికి చేర్చే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని కోరారు.

ఎన్ఆర్ఐలు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కోసం చట్టబద్ధమైన అధికారాలు కలిగిన ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రవాస భారతీయుల (NRI) ఓటరు నమోదు, అర్హతలు, ఎలక్టోరల్ రోల్స్ పునర్విమర్శకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం భారత ఎన్నికల సంఘం (ECI), తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) అధికారిక వెబ్‌సైట్లను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి యజ్ఞంలో ఎన్ఆర్ఐలు తమ వంతు పాత్ర పోషించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..






