Bhatti Vikramarka | ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవితా బీమా.. శుభవార్త వినిపించిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం.. అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.. సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది అని ఆయన తెలిపారు.
ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే... ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతాభావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యంకాని రీతిలో, కనివిని ఎరుగని ఒక మహాత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.
సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ను నూతనంగా ప్రవేశ పెడుతున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?





