India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్‌పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో పదిహేనేళ్లుగా ఒక్క ఫ్లైట్ కూడా ఎగర్లేదు. ఇండియాలోనే అతి చిన్న విమానాశ్రయంగా పేరొందిన దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే!
Popular news | Published On Aug 6, 2026, 11.55 pm IST
- మేఘాలయలోని బాల్జెక్ (Baljek) ఎయిర్‌పోర్ట్ భారతదేశంలోనే అతిచిన్న విమానాశ్రయాల్లో ఒకటి
- కేవలం 1.1 కిలోమీటర్ల రన్‌వే ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ 2008లో రూ.12.52 కోట్ల వ్యయంతో ప్రారంభం
- ఇక్కడ ఇప్పటివరకు ఒకే ఒక్కసారి (ప్రారంభోత్సవం రోజున) మాత్రమే విమానాలు ల్యాండ్ అయ్యాయి
- రన్‌వే మరీ చిన్నదిగా ఉండటంతో రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్స్ నడపలేక, దీన్ని ఇప్పుడు మ్యూజిక్ ఈవెంట్లకు వాడుతున్నారు.
India Smallest Airport | త్రినేత్ర.న్యూస్ : ఎయిర్‌పోర్ట్ (Airport) అనగానే మనకు పెద్దపెద్ద రన్‌వేలు, రద్దీగా ఉండే టెర్మినల్స్, నిమిషానికోసారి టేకాఫ్, ల్యాండ్ అయ్యే విమానాలు గుర్తొస్తాయి. కానీ, మన దేశంలో ఒక విమానాశ్రయం మాత్రం వీటన్నింటికీ పూర్తిగా భిన్నం. అదే మేఘాలయ (Meghalaya) రాష్ట్రం వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో ఉన్న 'బాల్జెక్ ఎయిర్‌పోర్ట్' (Baljek Airport). తురా నగరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్.. ఇండియాలోనే అతిచిన్న విమానాశ్రయంగా రికార్డు సృష్టించింది. అయితే, ప్రయాణికులతో కిటకిటలాడాల్సిన ఈ ప్రాజెక్ట్.. నేటికీ కమర్షియల్ ఫ్లైట్స్ (Commercial flights) లేక వెలవెలబోతోంది.
చిన్న ఎయిర్‌పోర్ట్.. పెద్ద కల
తురా (Tura) ఎయిర్‌పోర్ట్‌గా కూడా పిలిచే ఈ విమానాశ్రయ నిర్మాణ ఆలోచన 1983లో మొదలైంది. 1995లో ప్రభుత్వ ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టును రూ.12.52 కోట్ల వ్యయంతో నిర్మించారు. అక్టోబర్ 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. దీని రన్‌వే (Runway) పొడవు కేవలం 1.1 కిలోమీటర్లు, వెడల్పు 30 మీటర్లు మాత్రమే. ఇది సాధారణ కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌ల రన్‌వేల కంటే చాలా చిన్నది. అందుకే దీన్ని షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (STOL) ఫెసిలిటీగా డిజైన్ చేశారు. ముఖ్యంగా 20 సీట్ల కెపాసిటీ ఉండే డార్నియర్ 228 (Dornier 228) లాంటి చిన్న విమానాల కోసమే దీన్ని నిర్మించారు.

గారో హిల్స్ ప్రాంతంలోని మూడు జిల్లాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు, స్థానిక రైతులు పండించే తాజా ఉద్యానవన పంటలను దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా రవాణా చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. మారుమూల ప్రాంతాలకు ఇలాంటి చిన్న విమానాశ్రయాలు ఎంతో మేలు చేస్తాయని అప్పట్లో నాయకులు భావించారు.
ఆ ఒక్క రోజే విమానాల ల్యాండింగ్
ఈ ఎయిర్‌పోర్ట్ చరిత్రలో అక్టోబర్ 23, 2008న జరిగిన ప్రారంభోత్సవమే అత్యంత ఆసక్తికరమైన రోజు. ఆరోజు గౌహతి నుంచి వచ్చిన రెండు చిన్న విమానాలు (నాలుగు సీట్ల సెస్నా, తొమ్మిది సీట్ల డార్నియర్) ఇక్కడ ల్యాండ్ అయ్యాయి. బహుశా ఈ ఎయిర్‌పోర్ట్ చూసిన మొదటి, చివరి ఫ్లైట్ జర్నీలు అవే. ఆ తర్వాత మళ్లీ ఏ విమానం ఇక్కడ ల్యాండ్ కాలేదు. రెగ్యులర్ కమర్షియల్ ఆపరేషన్స్ అసలు మొదలవ్వనే లేదు.
దీనికి ప్రధాన కారణం రన్‌వే సైజ్. ATR 42, ATR 72 లాంటి కాస్త పెద్ద రీజినల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక్కడ ల్యాండ్ అవ్వడం సురక్షితం కాదు. ఈ సమస్యను అధిగమించడానికి రన్‌వేను విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అందుకోసం 1986-1989 మధ్య సేకరించిన 153 ఎకరాలకు అదనంగా, 2014లో మరో 58 ఎకరాల భూమిని కూడా సేకరించారు. అయినా సరే, ప్యాసింజర్ ఫ్లైట్స్ (Passenger flights) మాత్రం నేటికీ ప్రారంభం కాలేదు.
ఫ్లైట్స్ లేకపోవడంతో గత కొన్నేళ్లుగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను భారీ మ్యూజిక్ ఈవెంట్లు, పబ్లిక్ మీటింగ్‌ల కోసం వాడుతుండటం గమనార్హం. అయితే, సానుకూల అంశం ఏమిటంటే.. ఈ విమానాశ్రయాన్ని మళ్లీ ఆపరేషనల్ చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో కలిసి ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది.
తాజావార్తలు
- ●Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం.. సీఎం రేవంత్ విచారం
- ●Assam Rifles | పురుషులకు మాత్రమే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..
- ●Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
- ●Revanth Reddy | గ్రీన్ చానల్లో నిధులిస్తున్నా.. పనులు ఎందుకు వేగంగా జరగడంలే?.. వరంగల్ హాస్పిటల్ నిర్మాణంపై సీఎం రేవంత్ అసంతృప్తి
- ●Khairatabad Ganesh | భక్తులకు అలర్ట్.. రేపు రాత్రి వరకే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం
- ●తెలంగాణలో "మిని" సమరశంఖం: స్థానిక పోరులో గెలుపెవరిది? పార్టీల ప్రాగ్రెస్ రిపోర్ట్‌కు రియల్ టెస్ట్!

Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం.. సీఎం రేవంత్ విచారం

Assam Rifles | పురుషులకు మాత్రమే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

Revanth Reddy | గ్రీన్ చానల్లో నిధులిస్తున్నా.. పనులు ఎందుకు వేగంగా జరగడంలే?.. వరంగల్ హాస్పిటల్ నిర్మాణంపై సీఎం రేవంత్ అసంతృప్తి



