త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain | రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు..

Rain | రాష్ట్రంలో ఎండ‌లు (Heat Wave) దంచికొడుతున్నాయి. మార్చి నెల‌లో ప‌లు జిల్లాల్లో 40 డిగ్రీల‌కుపైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. అయితే రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరడంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

G

Telangana | Published On Mar 14, 2026, 11.23 am IST

Rain | రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు..
Advertisement

Rain | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు (Heat Wave) దంచికొడుతున్నాయి. మార్చి నెల‌లో ప‌లు జిల్లాల్లో 40 డిగ్రీల‌కుపైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. అయితే రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరడంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

ఆదివారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలోని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయ‌ని తెలిపారు. ఈనెల 16న రాష్ట్ర‌ వ్యాప్తంగా సుమారు 20 జిల్లాలో జల్లులు విస్తరిస్తాయ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. వర్షాల కారణంగా ప్రస్తుతం 40 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీలకు తగ్గనున్నాయని పేర్కొన్నారు.

కాగా, మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో క్యుములో నింబస్​ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంద‌ని తెలిపారు. ఆ సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు కనిపిస్తే ఆరు బయట ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవికూడా చ‌ద‌వండి..

ప్రపంచ రాజకీయాలకు 'బాస్'గా పుతిన్.. రష్యా చుట్టూనే అగ్రదేశాల ప్రదక్షిణలు ఎందుకు?

స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ హ‌ల్దీ ఫంక్ష‌న్‌.. డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్న చాహ‌ల్‌

సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడి.. దెబ్బ‌తిన్న 5 అమెరికా రీఫ్యూయ‌లింగ్ విమానాలు

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. డిజిట‌ల్ లుటేరా టూల్ కిట్‌తో యూపీఐ ఖాతాల హ్యాకింగ్‌..

Advertisement
Advertisement