Digital Lutera Android Toolkit | ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. డిజిటల్ లుటేరా టూల్ కిట్‌తో యూపీఐ ఖాతాల హ్యాకింగ్..
Digital Lutera Android Toolkit | యూపీఐ, బ్యాంకింగ్ యాప్స్‌కు ఇప్పటికే దేశంలో సిమ్ బైండింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సోషల్ మీడియా యాప్‌లకు కూడా ఇదే నియమాన్ని వర్తింపజేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిజిటల్ మోసాలు, ఐడెండిటీ ఫ్రాడ్‌ను అరికట్టవచ్చని కేంద్రం తెలిపింది.
Technology | Published On Mar 14, 2026, 10.45 am IST
Digital Lutera Android Toolkit | యూపీఐ, బ్యాంకింగ్ యాప్స్‌కు ఇప్పటికే దేశంలో సిమ్ బైండింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సోషల్ మీడియా యాప్‌లకు కూడా ఇదే నియమాన్ని వర్తింపజేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిజిటల్ మోసాలు, ఐడెండిటీ ఫ్రాడ్‌ను అరికట్టవచ్చని కేంద్రం తెలిపింది. అయితే సైబర్ నేరగాళ్లు సిమ్ బైండింగ్‌ను కూడా దాటి యూజర్లకు చెందిన యూపీఐ ఖాతాలను హ్యాక్ చేసేలా డిజిటల్ లుటేరా అనే ఓ టూల్‌కిట్‌ను ఉపయోగిస్తున్నారని సైబర్ భద్రతా సంస్థ క్లౌడ్ సెక్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ టూల్‌కిట్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు చెందిన యూపీఐ ఖాతాలను సైబర్ నేరగాళ్లు సులభంగా హ్యాక్ చేసి వాటి ద్వారా డబ్బును కాజేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఎలా పనిచేస్తుంది..
డిజిటల్ లుటేరా టూల్‌కిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వ్యాప్తి చెందుతుందని క్లౌడ్ సెక్ పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూప్‌లలో ఆకర్షణీయమైన యాప్‌ల పేరిట ఈ టూల్ కిట్‌ను సైబర్ నేరగాళ్లు వ్యాప్తి చెందిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా యాప్ లో ముందుగా టూల్‌కిట్‌ను చొప్పిస్తారు. తరువాత ఆ యాప్‌ను గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. ఆ యాప్ ఆకర్షణీయంగా కనిపించే సరికి యూజర్ దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. అనంతరం ఆ యాప్‌కు ఫోన్‌లోని ఎస్ఎంఎస్, కాల్ వంటి పర్మిషన్లు ఇవ్వగానే టూల్ కిట్ పని ప్రారంభిస్తుంది. యూజర్‌కు తెలియకుండానే ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లను సైబర్ నేరస్థులకు చేరవేస్తుంది. దీంతో ఆ మెసేజ్‌ల ద్వారా హ్యాకర్లు యూజర్‌కు చెందిన యూపీఐ ఖాతాను తమ ఫోన్‌లో ఓపెన్ చేస్తారు. ఇదే క్రమంలో సిమ్ బైండింగ్ రూల్‌ను కూడా ఆ టూల్‌కిట్ దాటవేస్తుంది. దీంతో హ్యాకర్ ఫోన్‌లో యూజర్‌కు చెందిన యూపీఐ ఖాతా ఓపెన్ అవుతుంది. ఎలాగూ మెసేజ్‌లు వస్తుంటాయి కనుక హ్యాకర్లకు పని సులభం అవుతుంది. ఒక్కసారి వారి ఫోన్ లో యూజర్‌కు చెందిన యూపీఐ ఖాతా యాక్సెస్ అవగానే వెంటనే డబ్బులు కాజేస్తారు. ఇదంతా యూజర్‌కు తెలియకుండానే జరుగుతుంది. దీంతో బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయ్యాయన్న విషయం కూడా యూజర్‌కు తెలియదు. ఇలా ఈ టూల్‌కిట్ అత్యంత ప్రమాదకరంగా మారిందని క్లౌడ్ సెక్ పరిశోధకులు వెల్లడించారు.
స్పందించిన ఎన్‌పీసీఐ..
అయితే క్లౌడ్ సెక్ నివేదికపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పందించింది. యూపీఐ యాప్ సిమ్ బైండింగ్ విధానాన్ని దాటవేయడం (బైపాస్) అంత సులభం కాదని, అత్యంత పటిష్టంగా భద్రతా చర్యలను అమలు చేస్తున్నామని తెలిపింది. ఈ టూల్‌కిట్ వంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే గట్టి భద్రతా చర్యలు చేపట్టామని, యూపీఐ వ్యవస్థ అనేక సెక్యూరిటీ లేయర్లు, ఆథెంటికేషన్ ధ్రువీకరణ విధానాలతో రూపొందించబడిందని, లావాదేవీలు అత్యంత సురక్షితంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. అయితే వినియోగదారులు మాత్రం గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఇతర ఎక్కడి నుంచైనా లభించే యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయకూడదని, అలాగే సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. లేదంటే ఫోన్ హ్యాకై డబ్బు నష్టం జరుగుతుందని తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



