Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూముల కుంభకోణం (Fab City Land Scam) పై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించిన హైకోర్టు (High Court) కు హ్యాట్సాఫ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) అన్నారు.
- ఎకరానికి రూపాయి లీజుతో 100 ఎకరాలు కట్టబెట్టారు
- ఎస్‌బీఐలో తనఖాగా పెట్టి రూ.500 రుణం తెచ్చిర్రు.. అదిప్పుడు రూ.640 కోట్లు దాటింది
- అయినా అక్కడ మొండి గోడల షెడ్డు తప్పా ఒక్క పరిశ్రమా లేదు
- కంచ గచ్చిబౌలి భూముల్లోనే అదే దోపిడీ
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
Fab City Land Scam | త్రినేత్ర న్యూస్: ఫ్యాబ్ సిటీ భూముల కుంభకోణం (Fab City Land Scam) పై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించిన హైకోర్టు (High Court) కు హ్యాట్సాఫ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) అన్నారు. రావిర్యాల ఫ్యాబ్ సిటీలో 'సెమ్ ఇండియా ఫ్యాబ్'కు ఏడాదికి ఎకరాకు రూపాయి లీజుతో 66 ఏళ్లకు 100 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. దీన్ని తనఖాగా పెట్టి రూ.500 కోట్ల రుణం తెస్తే నేడు అది రూ.640 కోట్లు దాటిందన్నారు. అయినా అక్కడ మొండి గోడల షెడ్డు తప్పా ఒక్క పరిశ్రమా లేదన్నారు. ఈ వ్యవహారాన్ని "నిరాశాజనకమైనది, అత్యంత శోచనీయమైనది" అని కడిగిపారేసిన హైకోర్టుకు ఆయన వందనాలు తెలిపారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ తాకట్టుకు వాడొద్దని బ్యాంకులు, బడా వ్యాపారులకు ఇది ఒక గట్టి హెచ్చరిక అని స్పష్టం చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఇది అసలు కుంభకోణం..
2007లో రావిర్యాల ఫ్యాబ్ సిటీలో 'సెమ్ ఇండియా ఫ్యాబ్'కు 100 ఎకరాలు కట్టబెట్టారు. 2010, ఫిబ్రవరి వరకు కూడా తట్టెడు మట్టి తీయకపోవడంతో 78 ఎకరాలను వెనక్కి తీసుకున్నారు. 2011, ఆగస్టు వరకు 18 నెలల్లోనే మళ్లీ అదే భూమిని (వెనక్కి తీసుకున్న దానితో సహా) ఎస్‌బీఐ (SBI) తనఖాగా అంగీకరించి రూ.500 కోట్ల రుణం ఇచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే భూమినిచ్చి, తనఖాకు అనుమతించాయి. వారి కళ్లముందే అది మొండి బకాయిగా (NPA) మారింది.
ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ కాపాడింది
2023, ఆగస్టులో ఫ్యాబ్ సిటీ 100 ఎకరాలను వెనక్కి తీసుకునే (resumption) ప్రక్రియను బీఆర్ఎస్ ప్రారంభించింది. కోర్టులోనూ ఆ నిర్ణయం నిలబడింది. ఎస్‌బీఐకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 మధ్య పసిఫిక్ హాస్పిటల్స్ రూ.22 కోట్లకు తనఖా పెట్టిన ఐటీ భూమి వేలాన్ని అడ్డుకుని కేటాయింపు రద్దు చేసింది. పనిచేయని 95 పరిశ్రమల నుండి 448 ఎకరాలు వెనక్కి లాక్కుని, మెహుల్ చోక్సీ గీతాంజలి భూమిని LIC వద్ద రూ.120 కోట్లకు తనఖా పెట్టిన వ్యవహారంపై విచారణ వేసింది. నిబంధనలు ఉల్లంఘించి తనఖా పెట్టిన భూములపై రుణాలు ఇవ్వవద్దని బ్యాంకులకు లిఖితపూర్వక హెచ్చరికలు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడితే, కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా తాకట్టు పెట్టారు.
మోసం జరిగే తీరిది (THE ANATOMY OF FRAUD)
భారీ పెట్టుబడి అంటూ హడావుడి చేసి నామమాత్రపు అద్దెకు ప్రభుత్వ భూమి ఇస్తారు. అడ్డదారిలో NOC తీసుకొచ్చి మార్కెట్ విలువకు బ్యాంకులో తనఖా పెడతారు. రుణం ఎగ్గొట్టడం (Default), చివరకు ప్రజల భూమిని వేలం వేయడానికి బ్యాంకులే ప్రభుత్వంతో కోర్టుల్లో పోరాడుతాయి అని ఆయన ఆరోపించారు.
కంచ గచ్చిబౌలి భూములపై అవే ప్రశ్నలు
ఒక జీవో (GO) ద్వారా 400 ఎకరాలను TGIIC కి బదిలీ చేసి, ప్రభుత్వ గ్యారెంటీతో ICICI బ్యాంకులో తనఖా పెట్టి రూ.10,000 కోట్ల అప్పు తెస్తోంది. TGIICకి మ్యుటేషన్ జరిగిన యాజమాన్య హక్కు ఉందా, లేదా కాగితపు జీవో మాత్రమేనా? బ్యాంకు ఏం తనిఖీలు చేసింది? రేపు కోర్టు ఆ భూమి హోదాను కొట్టివేస్తే, ఆ రూ.10,000 కోట్ల అప్పు ప్రజల నెత్తినే రుద్దుతారా? ఫ్యాబ్ సిటీ కేసులో SBIని హైకోర్టు అడిగిన ప్రశ్నలే కంచ గచ్చిబౌలి విషయంలోనూ తలెత్తుతున్నాయి.
అది క్షమించరాని నేరం
ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి, ఆశ్రిత పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి కమీషన్లు దండుకోవడానికి అది మీ జాగీరు కాదు. పూచీకత్తు లేదని పేద రైతులు, చిరు వ్యాపారులను మెడలు పట్టి గెంటేసే బ్యాంకులు, బడా కార్పొరేట్లకు కనీస తనిఖీలు లేకుండా వేల కోట్లు కట్టబెట్టడం క్షమించరాని నేరం. ఇది 'ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి' (Crony Capitalism) సజీవ నిదర్శనం అని దాసోజు ధ్వజమెత్తారు.
ఇవే మా సూటి ప్రశ్నలు
- రాష్ట్రంలో నేడు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి, ఏయే బ్యాంకుల్లో, ఎంత మొత్తానికి తనఖాలో ఉంది?
- 78 ఎకరాలు వెనక్కి తీసుకున్నాక కూడా 2011లో ఫ్యాబ్ సిటీ భూమి తనఖాకు NOC లు ఇచ్చింది ఎవరు? డిసెంబర్ 4న ఆ ఫైళ్లన్నీ హైకోర్టు ముందుంచుతారా?
- కంచ గచ్చిబౌలి రుణ నిబంధనలు, టైటిల్ పత్రాలు, రీపేమెంట్ ప్లాన్‌ను బయటపెడతారా?
- కోర్టులో బీఆర్ఎస్ చేసిన భూ-స్వాధీన నిర్ణయాన్ని సమర్థిస్తారా, లేదా SBI కి, ప్రమోటర్లకు కొమ్ముకాస్తారా?
డిమాండ్లివి..
- 2004 నుండి తనఖా పెట్టిన ప్రభుత్వ భూములపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలి
- బ్యాంకులు తనిఖీ చేసేలా ప్రభుత్వ భూకేటాయింపుల పబ్లిక్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలి
- రుణ మొత్తాన్ని ఎస్క్రో (Escrow) ఖాతాలో ఉంచి, నిర్మాణం జరుగుతున్న కొద్దీ విడుదల చేయాలి
- కాలపరిమితితో కూడిన CBI విచారణ జరిపి, కంచ గచ్చిబౌలి వ్యవహారాన్ని కూడా ఇదే గీటురాయిపై విచారించాలి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్
- ●KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
- ●Arjun | పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్
- ●India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..
- ●Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?
- ●MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ

Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్

KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!

Arjun | పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్

India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..






