GTA 6 | జీటీఏ 6 వచ్చేస్తోంది.. ప్రీ ఆర్డర్లు షురూ.. విడుదల ఎప్పుడు అంటే..?
GTA 6 | గేమింగ్ ప్రియులకు ప్రముఖ గేమ్ డెవలపర్ కంపెనీ రాక్ స్టార్ గేమ్స్ శుభవార్త చెప్పింది. వారు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న జీటీఏ 6 గేమ్‌ను ఎట్టకేలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాక్ స్టార్ గేమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గేమ్‌ను ఈ ఏడాది నవంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేసింది.
Technology | Published On Jun 19, 2026, 10.41 am IST
GTA 6 | గేమింగ్ ప్రియులకు ప్రముఖ గేమ్ డెవలపర్ కంపెనీ రాక్ స్టార్ గేమ్స్ శుభవార్త చెప్పింది. వారు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న జీటీఏ 6 గేమ్‌ను ఎట్టకేలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాక్ స్టార్ గేమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గేమ్‌ను ఈ ఏడాది నవంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు గాను జూన్ 25 నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) గేమ్‌కు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడగా ఎట్టకేలకు గేమ్ రిలీజ్ అవుతుండడం గేమర్లకు ఉత్సాహాన్నిస్తోంది. రాక్ స్టార్ గేమ్స్ కు చెందిన జీటీఏ ఫ్రాంచైజీ సూపర్ హిట్ గేమ్ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో వచ్చిన అన్ని గేమ్స్‌ను గేమర్లు భారీ ఎత్తున కొనుగోళ్లు చేశారు. చివరిసారిగా రిలీజ్ అయిన జీటీఏ 5 కు ఇప్పటికీ గేమర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అయితే జీటీఏ 5 వచ్చి దాదాపు 13 ఏళ్లు పూర్తవుతుండగా, చాలా సుదీర్ఘ విరామం అనంతరం రాక్ స్టార్ గేమ్స్ ఈ సిరీస్‌లో ఇప్పుడు కొత్త గేమ్‌ను లాంచ్ చేస్తోంది. దీంతో గేమర్లు జీటీఏ 6 పట్ల పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రపంప వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ..
కాగా జీటీఏ 6 ఇప్పటికే విడుదల కావల్సి ఉండగా, అనేక కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో అసలు గేమ్ లాంచ్ అవుతుందా, లేదా అని గేమర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ గేమ్ రిలీజ్ వాయిదాపై యూజర్లు ట్రోల్స్, మీమ్స్ పోస్ట్ చేశారు. గత మే నెలలోనే గేమ్ విడుదల కావల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో రిలీజ్‌ను వాయిదా వేసినట్లు రాక్ స్టార్ గేమ్స్ ప్రకటించింది. అయితే ఇప్పటికే జీటీఏ 6కు చెందిన ట్రైలర్‌కు గేమింగ్ ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. దీంతో గేమ్‌ను మరిన్ని రోజుల పాటు వాయిదా వేయడం సరికాదని రాక్ స్టార్ గేమ్స్ భావించింది. అందులో భాగంగానే ఎట్టకేలకు ఈ ఏడాది చివర్లో గేమ్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
మూడో ట్రైలర్ కోసం ఆసక్తిగా వెయిటింగ్..
అయితే అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ట్రైలర్ 3 ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికీ జూన్ 25 నుంచి జీటీఏ 6ను ప్లే స్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ ఎక్స్, ఎస్ సిరీస్‌లలో ప్రీ-ఆర్డర్ చేయవచ్చని స్పష్టం చేసింది. గేమ్ ధరను కూడా అదే రోజున వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్ స్టోర్‌లలో గేమ్‌ను విష్‌లిస్ట్ చేసుకునే చాన్స్ ఇచ్చారు. జూన్ 25న ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే సమయంలోనే రాక్‌స్టార్ కొత్త ట్రైలర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని గేమింగ్ వర్గాలు భావిస్తున్నాయి. జీటీఏ 6 మూడో ట్రైలర్ కోసం అభిమానులు ఏడాదికిపైగా ఎదురుచూస్తున్నారు. ప్రీ-ఆర్డర్ ప్రకటనతో పాటు రాక్‌స్టార్ గేమ్‌కు సంబంధించిన అధికారిక కవర్ ఆర్ట్‌ను కూడా ఆవిష్కరించింది. కొత్త ఆర్ట్‌వర్క్‌ను సోషల్ మీడియా ఛానళ్లతోపాటు యూట్యూబ్‌లో వీడియో రూపంలో విడుదల చేసింది. అలాగే జీటీఏ 6 అధికారిక వెబ్‌సైట్‌ను కూడా అప్‌డేట్ చేసి, హోమ్‌పేజీలో ప్రీ-ఆర్డర్ తేదీని చేర్చింది. కొత్త కవర్ ఆర్ట్‌తోపాటు రాత్రివేళల్లో కనిపించే వైస్ సిటీకి సంబంధించిన చిన్నపాటి విజువల్‌ను కూడా చూపిస్తోంది.
జీటీఏ 5 రికార్డును బ్రేక్ చేస్తుందా..
జీటీఏ 6 విడుదలతో 2027 ఆర్థిక సంవత్సరం తమకు చారిత్రాత్మకంగా మారుతుందని టేక్-టూ అంచనా వేస్తోంది. కంపెనీ 8 నుంచి 8.2 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి నెట్ బుకింగ్స్‌ను లక్ష్యంగా నిర్ణయించుకుంది. టేక్-టూ సీఈఓ స్ట్రాస్ జెల్‌నిక్ ఈ గేమ్‌ను ప్రపంచంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినోద ఉత్పత్తిగా అభివర్ణించారు. గేమింగ్ రంగం మాత్రమే కాకుండా మొత్తం వినోద పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ లాంచ్‌గా జీటీఏ 6 నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీటీఏ 5 గేమ్ ప్లే స్టేషన్, ఎక్స్ బాక్స్, మైక్రోసాఫ్ట్ విండోస్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 కోట్లకు పైగా కాపీలు అమ్ముడుపోగా, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 11 బిలియన్ డాలర్లకు పైగా లాభాలను సాధించింది. దీంతో జీటీఏ 6 ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●Tunga Balu | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: తుంగ బాలు డిమాండ్
- ●Hyderabad | మైనర్ బాలుడికి కారు స్టీరింగ్ ఇచ్చి.. కటకటాలపాలైన తండ్రి
- ●Maharashtra Teachers Arrest | పాఠశాలలో పాకిస్థానీ పాట.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపై కేసు
- ●Paraquat | పారాక్వాట్ గడ్డి మందుపై వైద్యుల ఆందోళన.. పూర్తిగా నిషేధించాల్సిందే అంటున్న నిపుణులు..
- ●NTA | నీట్ రీటెస్టు.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్టీఏ
- ●Israel Strikes On Lebanon | లెబనాన్‌పై మళ్లీ విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 16 మంది మృతి

Tunga Balu | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: తుంగ బాలు డిమాండ్

Hyderabad | మైనర్ బాలుడికి కారు స్టీరింగ్ ఇచ్చి.. కటకటాలపాలైన తండ్రి

Maharashtra Teachers Arrest | పాఠశాలలో పాకిస్థానీ పాట.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపై కేసు

Paraquat | పారాక్వాట్ గడ్డి మందుపై వైద్యుల ఆందోళన.. పూర్తిగా నిషేధించాల్సిందే అంటున్న నిపుణులు..



