SBI | ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తులు
SBI | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్ అందించింది. భారీ సంఖ్యలో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer- PO) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది.
SBI | త్రినేత్ర.న్యూస్: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్ అందించింది. భారీ సంఖ్యలో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer- PO) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1500 పీవో పోస్టులను భర్తీ చేస్తున్నది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు జూలై 8 చివరితేదీ. రాతపరీక్ష, గ్రూప్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి బేసిక్ పే రూ.48,480 ఉంటుంది. అలవెన్సులు కలుపుకొని సీటీసీ దాదాపు రూ.20 లక్షల నుంచి రూ.21.91 లక్షల వరకు అందుతుంది.
మొత్తం ఖాళీలు- 1500
ఇందులో 1,446 రెగ్యులర్ (జనరల్ 588, ఎస్సీ 216, ఎస్టీ 108, ఓబీసీ 390, ఈడబ్ల్యూఎస్ 144), 54 బ్యాక్‌లాగ్ పోస్టులు (ఎస్సీ-18, ఎస్టీ- 36) ఉన్నాయి.
అర్హతలు..
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎస్బీఐ అవకాశం కల్పించింది. అయితే, వీరు ఇంటర్వ్యూకి ఎంపికైతే.. 2026, సెప్టెంబర్ 30న లేదా అంతకంటే ముందే డిగ్రీ పాసైనట్లు తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. ఓబీసీ 3 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ 5, దివ్యాంగ అభ్యర్థులకు 10-15 ఏండ్ల
ఎంపిక విధానం..
ఎస్బీఐ పీఓ ఎంపిక మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్స్ పరీక్ష, మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష: ఇది ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మొత్తం 100 మార్కులకు గాను 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. గంట పరీక్ష పూర్తి చేయాలి. ఇంగ్లిష్-40 ప్రశ్నలు (20 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-30 (20 నిమిషాలు), రీజనింగ్-30 మార్కులు (20 నిమిషాలు) ఉంటాయి. అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ప్రతి కేటగిరీలోని ఖాళీలకు దాదాపు 10 రెట్లు ఉన్న అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామ్: దీనిని రెండు విధాలుగా నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్- 200 మార్కులు, డిస్క్రిప్టివ్ టెస్ట్ - 30 మార్కులు. మెయిన్స్ ఆన్‌లైన్ అబ్జెక్టివ్‌లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు 60 మార్కులు (50 నిమిషాలు), డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 30 ప్రశ్నలు 60 మార్కులు (45 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ పరిజ్ఞానం 60 ప్రశ్నలు 60 మార్కులు (45 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 20 మార్కుల (40 నిమిషాలు)తో మొత్తం 170 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు. కాలవ్యవధి 3 గంటలు. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో 3 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. కాలవ్యవధి 30 నిమిషాలు. మొత్తంగా ఈ రెండింటిని కలిపితే మెయిన్ ఎగ్జామ్ అనేది 230 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఫేజ్-3: సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 8
ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు
మెయిన్స్ పరీక్ష: సెప్టెంబర్
ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్: అక్టోబర్- నవంబర్ నెలల్లో
వెబ్‌సైట్: sbi.bank.in
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..
జూన్ 6, 2026

SBI Employee Strike | బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా.. వరుసగా ఐదు రోజుల సెలవులకు బ్రేక్..
మే 23, 2026

SBI Recruitment | ఎస్బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్.. రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
మే 14, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | జన్ జడ్ ఆకాంక్షల మేరకు రాహుల్ ప్రధాని కావాలి : మంత్రి పొన్నం
- ●GTA 6 | జీటీఏ 6 వచ్చేస్తోంది.. ప్రీ ఆర్డర్లు షురూ.. విడుదల ఎప్పుడు అంటే..?
- ●Stock Markets | ఐటీ షేర్లు భారీగా పతనం.. తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Worker Abducted | పని మానేశాడని.. బలవంతంగా ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..
- ●Engineering Counselling | నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. 28 వరకు స్లాట్ బుకింగ్..
- ●NEET UG | ఎల్లుండి నీట్ యూజీ.. హాల్ టికెట్లు తీసుకుంది 16 లక్షల మందే!

Ponnam Prabhakar | జన్ జడ్ ఆకాంక్షల మేరకు రాహుల్ ప్రధాని కావాలి : మంత్రి పొన్నం

GTA 6 | జీటీఏ 6 వచ్చేస్తోంది.. ప్రీ ఆర్డర్లు షురూ.. విడుదల ఎప్పుడు అంటే..?

Stock Markets | ఐటీ షేర్లు భారీగా పతనం.. తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Worker Abducted | పని మానేశాడని.. బలవంతంగా ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..



