త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మిలియన్‌ మార్చ్‌కు నేటితో 15 ఏళ్లు పూర్తి.. కీలకమైన ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్‌

KTR | తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్‌ (Million March)కు నేటితో 15 ఏళ్లు పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలో నాటి సంద‌ర్భాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) గుర్తు చేసుకున్నారు.

D

Telangana | Published On Mar 10, 2026, 12.55 pm IST

KTR | మిలియన్‌ మార్చ్‌కు నేటితో 15 ఏళ్లు పూర్తి.. కీలకమైన ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్‌
Advertisement

KTR | తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్‌ (Million March)కు నేటితో 15 ఏళ్లు పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలో నాటి సంద‌ర్భాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్య‌మాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కీల‌క ఘ‌ట్టాల్లో మిలియ‌న్ మార్చ్ ఒక‌ట‌ని పేర్కొన్నారు. 2011 మార్చి 10న మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా నిర్బంధాలు, దిగ్బంధాలు, అడ్డంకులు, బ్యారీకేడ్‌లు, ఇనుపకంచెలు ఇవేవీ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయని తెలిపారు. ల‌క్ష‌ల గొంతుక‌లు తెలంగాణ రాష్ట్రం కోసం ట్యాంక్‌బండ్‌పై నిన‌దించిన అద్భుత పోరాట రూపానికి నేటితో 15 ఏళ్లు పూర్త‌య్యాయ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

https://x.com/KTRBRS/status/2031242935547871552

మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టంగా మిలియన్ మార్చ్ నిలిచిపోయింది. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 2011 మార్చి 10న ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. నాడు హైద‌రాబాద్ న‌డిబొడ్డున నిర్వ‌హించిన మిలియ‌న్ మార్చ్ విజ‌య‌వంత‌మైంది. ఈ మార్చ్ తెలంగాణ ఉద్య‌మాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లింద‌ని చెప్పుకోవ‌చ్చు. ఆనాటి ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆనాడు మిలియన్ మార్చ్‌కు తరలివచ్చి ప్ర‌త్యేక రాష్ట్ర‌ ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను చాటారు.

Also Read..

Kalvakuntla Kavitha | ఖ‌మ్మంలో హైడ్రామా.. క‌విత దీక్ష‌ను భ‌గ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

Ritu Varma | రూటు మార్చిన టాలీవుడ్ హీరోయిన్‌ - ఫ‌స్ట్ టైమ్ యాక్ష‌న్ రోల్‌

Trump Advisers Urge Exit Plan From Iran War | యుద్ధం నుంచి వైదొలుగుదాం.. ట్రంప్‌పై సలహాదారుల ఒత్తిడి

Advertisement
Advertisement