Ritu Varma | రూటు మార్చిన టాలీవుడ్ హీరోయిన్ – ఫస్ట్ టైమ్ యాక్షన్ రోల్
టాలీవుడ్ హీరో రీతూ వర్మ తన రూటు మార్చేసింది. ఫస్ట్ టైమ్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతుంది. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా నుంచి రీతూ వర్మ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు
Entertainment | Published On Mar 10, 2026, 12.27 pm IST
Ritu Varma | కెరీర్ ఆరంభం నుంచి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది హైదరాబాదీ బ్యూటీ రీతూ వర్మ. వచ్చినవి కాకుండా నచ్చిన సినిమాలు మాత్రమే ఎంచుకుంటోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది. రీతూ వర్మ అంటే పద్దతి, పర్‌ఫెక్షన్‌గా టాలీవుడ్ ఫ్యాన్స్ చెబుతుంటారు. గత సినిమాల్లో రీతూ వర్మ నటనకు పేరొచ్చిన కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం ఈ బ్యూటీకి దగ్గలేదు. పెళ్లి చూపులు లాంటి పెద్ద విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ తన రూటు మార్చేసింది. ఫస్ట్ టైమ్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతుంది.
ఘాజీ దర్శకుడితో...
గోపీచంద్ హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఏడవ శతాబ్దానికి చెందిన చరిత్రలో మరుగున పడిన ఓ యోధుడి కథతో ఈ మూవీ రూపొందుతోంది. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా రానున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.
రీతూ వర్మ బర్త్‌డే...
ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మేకర్స్ ఆమె ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యవతి అనే పాత్రలో రీతూ వర్మ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. కొండ గుహలో చేతిలో విల్లుతో బాణం గురిపెట్టి పోరాట యోధురాలిగా ఈ పోస్టర్‌లో రీతూ వర్మ కనిపించింది. ఆమె వేషధారణ చూస్తుంటే గిరిజన యువతిగా రీతూ వర్మ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రఫ్ అండ్ టఫ్‌తో కూడిన యాక్షన్ రోల్‌లో రీతూ వర్మ నటిస్తున్నట్లు సమాచారం.
33వ మూవీ ఇది...
గోపీచంద్ హీరోగా నటిస్తోన్న 33వ మూవీ ఇది. ఈ సినిమాకు శూల అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు ప్రచారంజరుగుతోంది. హిస్టారికల్ కథతో గోపీచంద్ చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు.
.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



