Deeksha Divas | ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం
Deeksha Divas | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) వాసులు బీఆర్ఎస్ అధినే కేసీఆర్‌పై (KCR) తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. దీక్షా దివస్ (Deeksha Divas) సందర్బంగా ఒకరోజు ముందే Mukhra K గ్రామంలో వేడుకలను ప్రారంభించారు.
Deeksha Divas | త్రినేత్ర న్యూస్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) వాసులు బీఆర్ఎస్ అధినే కేసీఆర్‌పై (KCR) తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. దీక్షా దివస్ (Deeksha Divas) సందర్బంగా ఒకరోజు ముందే Mukhra K గ్రామంలో వేడుకలను ప్రారంభించారు. 17 ఏండ్ల క్రితం పార్టీ అధినేత కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని గుర్తుచేసుకుందామని గ్రామస్తులు అన్నారు. 2009, నవంబర్ 29న తెలంగాణ (Telangana) కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రాన్ని ఒప్పించిన మహాఘట్టం దీక్షా దివస్ అని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపు మేరకు గ్రామంలో ముందుగానే దీక్షా దివస్‌ను జరుపుకున్నారు.

ఎడ్లబండిపై కేసీఆర్ ఫోటో పెట్టి డప్పులు వాయిస్తూ పుష్పాభిషేకం చేస్తూ పాలాభిషేకం చేశారు. కేసీఆర్ లేకుండా 300 ఏండ్లలైనా తెలంగాణ వచ్చేది కాదని, 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, రాష్ట్రాన్ని సాధించే వరకు వెనకడుగు వేయని నాయకుడు కేసీఆర్ అని అన్నారు. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని, కేసీఆర్ తప్ప మరో నాయకుడు తెలంగాణను అభివృద్ధి చేయలేడన్నారు. దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినమని అన్నారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, మళ్లీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కేటీఆర్ నాయకత్వంలో, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో పార్టీ కోసం ఎల్లవేళలా పని చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






