త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం: మ‌హేశ్ గౌడ్‌

Mahesh Goud | ప్రస్తుత పద్ధతిలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న (Delimitation) జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంద‌ని టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని వెల్ల‌డించారు.

G

Telangana | Published On Nov 28, 2026, 12.58 pm IST

Mahesh Goud | డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం: మ‌హేశ్ గౌడ్‌
Advertisement

Mahesh Goud | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులే పార్టీని మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో బీజేపీ ఎక్క‌డుంద‌ని అచ్చంపేట స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు ఆ పార్టీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ఆత్మప‌రిశీల‌న చేసుకోవాల‌న్నారు. ఆ పార్టీ పాలనలో దేశ‌వ్యాప్తంగా సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమ‌ర్శించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. యువ‌త‌కు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చార‌ని నిల‌దీశారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌మ‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌ నిర్మాణ కార్యక్రమం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

హెచ్ఎండీఏ భూముల విక్రయానికి బిడ్లు న‌మోదు కాక‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉండొచ్చ‌ని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం కారణం కాదని తెలిపారు. ప్రస్తుత పద్ధతిలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న (Delimitation) జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంద‌ని చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని వెల్ల‌డించారు.

 

Advertisement
Advertisement