Bhu Bharathi | ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు షురూ..
Bhu Bharathi | రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే మరో కీలక అడుగు పడనుంది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IDLRMS) పేరుతో సమీకృత భూ భారతి (Bhu Bharathi) పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Bhu Bharathi | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే మరో కీలక అడుగు పడనుంది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IDLRMS) పేరుతో సమీకృత భూ భారతి (Bhu Bharathi) పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం నుంచి ఐదు మండలాల్లో.. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కొస్గీలో ప్రయోగాత్మకంగా పోర్టల్ సేవలను ప్రారంభించింది. సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేస్తూ దీనిని రూపొందించింది. పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫలితాల ఆధారంగా మార్పులు చేసి, భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది.
భూపరిపాలనకు సంబంధించిన సమాచారమే కాకుండా సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సమాచారం కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల వివరాలు, ఫీడ్‌బ్యాక్, అధికారుల వివరాలు, ఆర్‌వోఆర్-1బీ, ఎల్‌పీఎం (భూదార్), దరఖాస్తులు, సిటిజన్ చార్టర్, డౌన్‌లోడ్స్, మ్యూటేషన్ ఆర్డర్లు, భూముల మార్కెట్ విలువలు, భూనక్షా, ధరణి కంటే ముందునాటి ఈసీలు, ఫీజుల రీఫండ్ వివరాలతో కూడిన 15 అంశాలతో ఈ పోర్టల్ డ్యాష్‌బోర్డు ఉంటుంది. ఒక్కో అంశంపై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం లభిస్తుంది.
ఇవికూడా చదవండి..
5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు: మంత్రి పొంగులేటి
రాష్ట్ర ప్రజలకు షాకింగ్ న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ఛార్జీలు పెంపు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






