Ponguleti Srinivas Reddy | భూ భారతితో సర్వే చేసి.. దశాబ్దాల భూసమస్యలను తీర్చి..
Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో రెవెన్యూ, గౄహనిర్మాణ సమస్యల పరిష్కారం లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం మహబుబాబాద్ జిల్లా నారాయణపురంలో దాదాపు 60 ఏండ్ల నుండి పరిష్కారం కాకుండా ఉన్న పేద రైతుల అసైన్డ్ భూసమస్యలను భూభారతి రిసర్వేతో పరిష్కరించి, వారికి ఈరోజు భూఆధార్‌తో కూడిన పట్టాదార్ పాసుబుక్కులు ఇవ్వడం జరిగింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రైతులకు పట్టా పాస్‌బుక్‌లు అందజేసిన మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో రెవెన్యూ, గౄహనిర్మాణ సమస్యల పరిష్కారం లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం మహబుబాబాద్ జిల్లా నారాయణపురంలో దాదాపు 60 ఏండ్ల నుండి పరిష్కారం కాకుండా ఉన్న పేద రైతుల అసైన్డ్ భూసమస్యలను భూభారతి రిసర్వేతో పరిష్కరించి, వారికి ఈరోజు భూఆధార్‌తో కూడిన పట్టాదార్ పాసుబుక్కులు ఇవ్వడం జరిగింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో 125 సంవత్సరాల క్రితం భూసర్వే జరిగింది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరూ సర్వే చేయలేదు. చివరికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన గత పాలకులు కనీసం ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం తెచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేసి భూయజమానులకు చుట్టం లాంటి భూభారతి చట్టాన్ని తెచ్చి దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం చేస్తుంది. భూవివాదాలు లేని తెలంగాణగాను తీర్చిదిద్దడమే సంకల్పంగా రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమిని సర్వే చేస్తున్నాం. అనంతరం క్యూఆర్ కోడ్, మ్యాప్‌తో కూడిన పట్టాపాస్‌బుకులను రైతన్నలు, భూయజమానులకు అందిస్తున్నాం. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం మండలం నారాయణపురంలో సర్వే పూర్తి చేసుకున్న సుమారు 1378 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించిన 780 మంది రైతులకు భూపట్టాలను పంపిణీ పంపిణీ చేయడం జరిగింది అని మంత్రి తెలిపారు.
నారాయణపురంలో ఇంకా మిగిలి ఉన్న తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న సుమారు 150 ఎకరాల అసైన్డ్ భూమి విషయంలో త్వరలోనే సమస్యను పరిష్కరించి ఆ రైతులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పదేండ్లు అధికారంలో ఉండి దశాబ్దాలుగా భూసమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే పట్టించుకోని బీఆర్ఎస్ ప్రబుద్ధులు ఇప్పుడు భూ సమస్యల మీద మాట్లాడడం సిగ్గుచేటు. వారికి ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. ప్రతిపక్ష నాయకులతో చెప్పించుకునే పరిస్థితుల్లో ఈ ప్రజాప్రభుత్వం లేదు. ఆ పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి రాదు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



