Nizamabad | నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య..
Nizamabad | నిజామాబాద్ జిల్లా (Nizamabad) కాంగ్రెస్ సీనియర్ నేత, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం ఇందరల్వాయి మండలం గౌరారం వద్ద దుండగలు కారుతో వేగంగా వచ్చి గోపిని ఢీకొట్టారు.
Nizamabad | త్రినేత్ర.న్యూస్: నిజామాబాద్ జిల్లా (Nizamabad) కాంగ్రెస్ సీనియర్ నేత, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం ఇందరల్వాయి మండలం గౌరారం వద్ద దుండగలు కారుతో వేగంగా వచ్చి గోపిని ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడిని గోపి దగ్గరి బంధువైన సతీశ్‌గా గుర్తించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల కారణాలు ఏమిటి?, ముందస్తు ప్రణాళికతోనే హత్య చేశాడా?.. అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ రాజకీయ విభేదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, ఇమ్మడి గోపీ హత్యతో గౌరవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన తెలిసిన వెంటనే గ్రామానికి పెద్దఎత్తున చేరుకున్న పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు. గోపీ మరణంతో స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇవికూడా చదవండి..
లాక్‌డౌన్ రివ్యూ - అనుపమ పరమేశ్వరన్ ధైర్యానికి హ్యాట్సాఫ్ - హార్డ్ హిట్టింగ్ మూవీ
చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసులకు ఫిర్యాదు
సుదూర ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ రైలు.. ఫ్లయిట్ టికెట్ల తరహాలోనే కన్ఫర్మ్ టికెట్..!
పాయింట్ బ్లాక్‌లో తుపాకీ.. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
అడ్మిట్ కార్డులో అభ్యర్థికి బదులు కుక్క ఫొటో..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






