Farooq Abdullah | పాయింట్ బ్లాక్‌లో తుపాకీ.. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయనపై హత్యాయత్నాన్ని (Assassination Attempt) భద్రతా సిబ్బంది భగ్నం చేశారు.
Farooq Abdullah | త్రినేత్ర.న్యూస్: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయనపై హత్యాయత్నాన్ని (Assassination Attempt) భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. బుధవారం రాత్రి ఆయన జమ్ములోని గ్రేటర్ కైలాష్‌లో (Greater Kailash) ఉన్న రాయల్ పార్క్‌లో జరిగిన ఒక పెండ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. జనంలో నుంచి వచ్చిన ఓ దుండగుడు అబ్దుల్లాపై పాయింట్ బ్లాక్‌లో పిస్టల్‌తో కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన నేషల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) కమాండోలు దుండగుడిని వెనక్కి నెట్టేశారు. ఆలోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు.
అయితే ఫరూక్ అబ్దుల్లాకు గానీ, ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గానీ ఎలాంటి గాయాలూ కాలేదని పోలీసులు తెలిపారు. దుండగుడిని జమ్ములోని పురానీ మండీకి చెందిన కమల్‌సింగ్‌గా గుర్తించామన్నారు. మైనింగ్ వ్యాపారి అయిన అతడు ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని చెప్పారు. కాగా, గత 20 ఏండ్లుగా దీనికోసమే ఎదురుచూస్తున్నట్లు నిందితుడు తెలిపాడు.
దేవుడి దయవల్ల ఫరూఖ్ అబ్దుల్లా బతికి బయటపడ్డారని సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) చెప్పారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రతను దాటుకుని నిందితుడు ఎలా దూసుకొచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఘటన జరిగిన సమయంలో అబ్దుల్లా వెంట జమ్ముకశ్మీర్ ఉపముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, ముఖ్యమంత్రి సలహాదారు నసీర్ సోగమీ కూడా ఉన్నారు.
https://x.com/iamnarendranath/status/2031793795621404797
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి






