Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 జాబితా విడుదలైంది. ఈ ఏడాది భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ 125కి పడిపోయింది. అయితే ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చంటే?
- గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో 125వ స్థానానికి పడిపోయిన భారతదేశం
- ఇండియన్ పాస్‌పోర్ట్‌తో కేవలం 26 గమ్యస్థానాలకు మాత్రమే వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం
- 104వ ర్యాంక్‌తో భారత్ కంటే ముందున్న చైనా
- అట్టడుగున పాకిస్థాన్ (188), బంగ్లాదేశ్ (166)
- ఈ తాజా ర్యాంకింగ్స్‌లో యూరోపియన్ దేశాలదే పైచేయి కాగా, అమెరికా 11వ స్థానంలో
Global Passport Index 2026 | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ పాస్‌పోర్ట్‌కు ఎంత పవర్ ఉందో తెలిపే 'గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026' (Global Passport Index 2026) తాజాగా విడుదలైంది. అయితే ఈ ఏడాది భారతీయులకు కాస్త నిరాశే ఎదురైంది. ప్రపంచంలోని టాప్-100 పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితాలో చోటు దక్కించుకోవడంలో విఫలమైన భారత్.. ఏకంగా 125వ స్థానానికి పడిపోయింది.
ర్యాంకింగ్స్‌లో వెనుకబాటు
గత కొన్నేళ్ల డేటాను గమనిస్తే.. 2021 నుంచి 2023 వరకు 127వ స్థానంలో ఉన్న ఇండియా.. ఆ తర్వాత పుంజుకుని 2025లో 124వ ర్యాంక్‌కు ఎగబాకింది. కానీ, 2026 తాజా జాబితాలో సాధించిన ఆ చిన్నపాటి లాభాన్ని కూడా కోల్పోయి ఒక స్థానం దిగజారి 125కి పరిమితమైంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం ఫిలిప్పీన్స్, మొరాకో, ఉజ్బెకిస్తాన్, నమీబియా లాంటి దేశాలు కూడా భారత్ కంటే మెరుగైన ర్యాంకుల్లో ఉండటం గమనార్హం. అయితే.. అజర్‌బైజాన్, కిర్గిజ్‌స్థాన్ కంటే మన పాస్‌పోర్ట్ కాస్త ముందుంది.
26 దేశాలకు మాత్రమే వీసా-ఫ్రీ
ప్రస్తుతం.. ఇండియన్ పాస్‌పోర్ట్ (Indian passport) ఉన్నవారు కేవలం 26 దేశాలకు మాత్రమే ముందుగా వీసా తీసుకోకుండా (Visa-free) ప్రయాణించవచ్చు. లేదా ఆయా దేశాల్లో అడుగుపెట్టగానే వీసా-ఆన్-అరైవల్ (Visa-on-arrival) సదుపాయం లభిస్తుంది. ఈ జాబితాలో భూటాన్, నేపాల్, జమైకా, మకావు, పాలస్తీనా, ట్యునీషియా, అంగోలా, బార్బడోస్ తదితర దేశాలు ఉన్నాయి.
అదే సమయంలో, అమెరికా (USA), యూకే (UK), జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యూఏఈ (UAE) వంటి దాదాపు 88 ప్రధాన దేశాల్లో అడుగుపెట్టాలంటే భారతీయులకు కచ్చితంగా ముందస్తు వీసా (Visa) ఉండి తీరాల్సిందే.
పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందంటే?
మన పొరుగు దేశాల ర్యాంకులను గమనిస్తే.. చైనా 104వ ర్యాంక్‌లో నిలిచి భారత్ కంటే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అయితే, ఇతర దక్షిణాసియా దేశాలతో పోలిస్తే ఇండియా పాస్‌పోర్ట్ ఎంతో బలంగా ఉందని చెప్పవచ్చు. ఈ ఇండెక్స్‌లో నేపాల్ 164వ ర్యాంక్, బంగ్లాదేశ్ 166వ ర్యాంక్‌లో ఉండగా.. పాకిస్థాన్ దారుణంగా 188వ స్థానంతో అట్టడుగున నిలిచింది.
టాప్‌లో యూరప్ దేశాల ఆధిపత్యం
ఈ గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో యూరోపియన్ (European) దేశాలు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాయి. గ్లోబల్ ట్రావెల్ మొబిలిటీలో అగ్రస్థానాలన్నీ దాదాపు ఆ దేశాలే కైవసం చేసుకున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా, ఫ్రాన్స్ తృటిలో టాప్-10లో చోటు కోల్పోయి 11వ స్థానాన్ని పంచుకున్నాయి. కెనడా 13వ ర్యాంక్‌ను దక్కించుకుని నార్త్ అమెరికా పాస్‌పోర్ట్‌ల పవర్‌ను చాటిచెప్పింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం
- ●KTR | కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. రాష్ట్రమంతా నీళ్లు పారిస్తాం..

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం

New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం




