New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల( New Ration Cards ) జారీ ప్రక్రియపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన వారు కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. 48 గంటల్లోనే జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
New Ration Cards | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల( New Ration Cards ) జారీ ప్రక్రియపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన వారు కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. 48 గంటల్లోనే జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీద్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాతో కలిసి 2 బీహెచ్‌కే గృహాల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేశామని చెప్పారు. అలాగే అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డు జారీ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ, అర్హత గల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, హైదరాబాద్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యత్వాన్ని విస్తృతంగా పెంచాలని పిలుపునిచ్చారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా విద్య, ఉపాధి, కుటుంబ అవసరాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్లేందుకు ఎంతో సౌలభ్యం కలిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్న మాజీ మంత్రి తలసాని
జులై 18, 2026

Bullet Train Project | బహదూర్‌గూడలో ఉద్రిక్తత.. భూముల స్వాధీన భారీగా చేరుకున్న హైడ్రా అధికారులు
జులై 18, 2026

Project Safe Stay | ప్రాజెక్ట్ సేఫ్ స్టేకు శ్రీకారం.. హాస్టళ్లు, పీజీల నమోదు ఇక తప్పనిసరి..!
జులై 17, 2026
తాజావార్తలు
- ●Apple iPad | కంటెంట్ క్రియేటర్ల కోసం ఏ ఐప్యాడ్ సెట్ అవుతుంది.. ఫీచర్లు ఎలా ఉండాలి..?
- ●SIP | రూ.2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎస్ఐపీ లేదా లంప్సమ్.. ఏది ఉత్తమం..?
- ●Priyanka Chopra | వారణాసి నుంచి ప్రియాంక చోప్రా బర్త్‌డే ట్రీట్ - మహేష్ సినిమా కోసం గ్లోబల్ స్టార్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
- ●PM Modi | భారత్‌ను గర్వపడేలా చేశారు.. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
- ●Heavy Rains | ఏటూరు నాగారంలో భారీ వర్షం.. 115.3 మి.మీ. వర్షపాతం నమోదు
- ●Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు హై అలర్ట్.. భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక..

Apple iPad | కంటెంట్ క్రియేటర్ల కోసం ఏ ఐప్యాడ్ సెట్ అవుతుంది.. ఫీచర్లు ఎలా ఉండాలి..?

SIP | రూ.2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎస్ఐపీ లేదా లంప్సమ్.. ఏది ఉత్తమం..?

Priyanka Chopra | వారణాసి నుంచి ప్రియాంక చోప్రా బర్త్‌డే ట్రీట్ - మహేష్ సినిమా కోసం గ్లోబల్ స్టార్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?

PM Modi | భారత్‌ను గర్వపడేలా చేశారు.. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ



