Lockdown Review | లాక్‌డౌన్ రివ్యూ – అనుపమ పరమేశ్వరన్ ధైర్యానికి హ్యాట్సాఫ్ – హార్డ్ హిట్టింగ్ మూవీ
అనుపమ పరమేశ్వరన హీరోయిన్‌గా నటించిన లాక్‌డౌన్ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. డ్రామా థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి ఏఆర్ జీవా దర్శకత్వం వహించాడు. లాక్‌డౌన్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On Mar 12, 2026, 10.16 am IST
Lockdown Review | అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన లాక్‌డౌన్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏఆర్ జీవా దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఎందంటే...
అనిత సంఘర్షణ
అనిత (అనుపమ పరమేశ్వరన్) మిడిల్ క్లాస్ యువతి. తండ్రి సురేష్ (చార్లీ) ఓ వెల్డింగ్ షాఫ్‌లో పనిచేస్తుంటాడు. డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది అనిత. ప్రేమిస్తున్నామంటూ అనిత వెంట చాలా మంది పడతారు. కానీ తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుందనే భయంతో ఆ ప్రపోజల్స్ రిజెక్ట్ చేస్తుంది. జాబ్ కోసం ఓ రోజు స్నేహితురాలిని కలుస్తుంది అనిత. ఇద్దరు కలిసి ఓ పార్టీకి వెళతారు. ఆ పార్టీలో తాగేసి పడిపోతుంది అనిత. రెండు నెలల తర్వాత అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్ వెళుతుంది. అప్పుడే తాను ప్రెగ్నెంట్ అనే షాకింగ్ నిజం అనితకు తెలుస్తుంది. పెళ్లి కాకుండానే తల్లి అయిన అనిత కుటుంబం పరువు పోతుందనే భయంతో ఇంట్లో వాళ్లకు తెలియకుండా కడుపు తీయించుకోవాలని అనుకుంటుంది. ఓ డాక్టర్‌కు డబ్బులు ఇస్తుంది. కానీ అదే రోజు కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏమైంది? ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రెగ్నెన్సీని అనిత ఎలా దాచింది? పార్టీలో ఏం జరిగింది? చేయని తప్పును సరిదిద్దుకునే క్రమంలో అనిత జీవితం ఎలా నాశనమైపోయింది? అన్నదే లాక్‌డౌన్ మూవీ కథ.
కమర్షియల్ సినిమాలకు భిన్నంగా...
లాక్‌డౌన్ హార్డ్‌హిట్టింగ్ మూవీ. పెళ్లి కాకుండానే తాను తల్లి కాబోతున్నానని తెలిసినప్పుడు ఓ అమ్మాయి పడే వేదన, ఆమె ఎదుర్కొనే మానసిక సంఘర్షణను చాలా రియలిస్టిక్‌గా దర్శకుడు ఈ సినిమాలో చూపించారు. కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా తనకు జరిగిన అన్యాయంపై హీరోయిన్ పోరాడటం లాంటివేవి ఈ సినిమాలో కనిపించవు. నిజజీవితంలో ఎలా ఉంటుందో అలాగే చూపించారు.
నిజాలేమిటో తెలుసుకోకుండా...
పెరిగిపోతున్న అబార్షన్లు, పెళ్లికాకుండానే తల్లవుతున్న అమ్మాయిలు...లాంటి కథనాలు ప్రతి రోజు టీవీల్లో, పేపర్లలో కనిపిస్తుంటాయి. వీటిలో నిజానిజాలేమిటో తెలిసుకోకుండానే సొసైటీ యువతులపైనే నిందలు వేస్తుంది. కానీ తాము చేయని తప్పుకు కూడా శిక్ష అనుభవించేవాళ్లు చాలానే ఉంటారు. అలాంటి ఓ యువతి కథే ఈ సినిమా. మిడిల్ క్లాస్‌లో పరువుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు...ఓ అబ్బాయితో యువతి మాట్లాడితే చాలు...ఆమెపై ఎలాంటి పుకార్లు సృష్టిస్తారు... ఎదుటివారిలోని బలహీనతలను అడ్వాంటేజ్‌గా తీసుకొనే వాళ్లు సొసైటీలో ఎలా ఉంటారన్నది వాస్తవిక కోణంలో టచ్ చేశారు.
ఆవేదన...బాధ...
లాక్‌డౌన్ కథ మొత్తం కరోనా టైమ్‌లోనే సాగుతుంది. కానీ తన బాధను, మనసులో ఉన్న ఆవేదనను కనీసం కన్నవారితో పంచుకోలేని పరిస్థితి రావడమే నిజమైన లాక్‌డౌన్ అని ఈ సినిమా ద్వారా చెప్పారు డైరెక్టర్. లాక్‌డౌన్ పాయింట్ బాగుంది కానీ డాక్యుమెంటరీ స్టైల్‌లో డైరెక్టర్ ప్రజెంట్ చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పెట్టిన మూడు పాటలు సినిమా నిడివిని పెంచడానికే ఉపయోగపడ్డాయి.
రాయడం కాదు...నటించడం గ్రేట్....
లాక్‌డౌన్ లాంటి కథలు రాయడం కాదు...ఇలాంటి స్టోరీలో నటించడానికి అంగీకరించిన అనుపమ పరమేశ్వరన్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. నిజంగా అనిత అనే యువతి జీవితాన్నే చూసినట్లుగా అనిపిస్తుంది. అనుపమ ఎక్కడ కనిపించదు. క్లైమాక్స్‌లో అనుపమ నటన కన్నీళ్లు పెట్టిస్తుంది.
హీరోయిన్ తల్లిదండ్రులుగా చార్లీ, నిరోషా నటన బాగుంది.
యాక్టింగ్ కోసం...
లాక్‌డౌన్ మనసులను కదిలించే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ కోసం చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ – విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్
ఆగస్టు 18, 2026

Anupama Parameswaran | టాలీవుడ్ హీరోల్లో అతడే నా క్లోజ్‌ఫ్రెండ్ – అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్
ఆగస్టు 16, 2026

Anupama Parameswaran | అతడో అపరిచితుడు – సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి – మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



