Admit Card | అడ్మిట్ కార్డులో అభ్యర్థికి బదులు కుక్క ఫొటో..
Admit Card | అధికారుల నిర్లక్ష్యం ఓ అభ్యర్ధిని అయోమయానికి గురిచేసింది. ఉద్యోగ నియామక పరీక్ష అడ్మిట్ కార్డులో (Admit Card) అభ్యర్థికి బదులు కుక్క ఫొటో దర్శనమిచ్చింది. దీంతో పరీక్ష సమయం దగ్గరపడుతున్నదని, తప్పును సరిచేసి సరైన హాల్‌టికెట్ ఇవ్వాలంటూ అభ్యర్ధించినప్పటికీ ఫలితం లేదు.
Admit Card | త్రినేత్ర.న్యూస్: అధికారుల నిర్లక్ష్యం ఓ అభ్యర్ధిని అయోమయానికి గురిచేసింది. ఉద్యోగ నియామక పరీక్ష అడ్మిట్ కార్డులో (Admit Card) అభ్యర్థికి బదులు కుక్క ఫొటో దర్శనమిచ్చింది. దీంతో పరీక్ష సమయం దగ్గరపడుతున్నదని, తప్పును సరిచేసి సరైన హాల్‌టికెట్ ఇవ్వాలంటూ అభ్యర్ధించినప్పటికీ ఫలితం లేదు. ఈ ఘటన బీహార్‌లోని (Bihar) రోహ్‌టస్ జిల్లాలో జరిగింది.
నాలుగేండ్ల క్రితం అంటే 2022లో రోహ్‌టస్ జిల్లా, సెషన్స్ కోర్టులో ప్యూన్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి రితేశ్ కుమార్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నేండ్ల తర్వాత మార్చి 15న పరీక్ష నిర్వహించనున్నట్లు నియామక సంస్థ ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. దీంతో రితేశ్ తన అడ్మిట్‌కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. తీరా చూస్తే హాల్‌టికెట్‌లో తన ఫొటోకు బదులు గోల్డెన్ రిట్రైవర్ జాతి కుక్క దర్శనమిచ్చింది. దీంతో ఆశ్చర్యానికి లోనైన అతడు సంబంధిత అధికారులకు తప్పును సరిచేసుకుని సరైన హాల్‌టికెట్ జారీ చేయాలని అభ్యర్థించాడు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వాపోయాడు.
తాను దరఖాస్తు చేసేటప్పుడు సరైన ఫొటేనే అప్‌లోడ్ చేశానని, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింటౌట్ను చూపించాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాను పరీక్షకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎప్పుడో 2022లో నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యను సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేదని, పరీక్షకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సంబంధిత వార్తలు

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026

Hyderabad | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకోమంటే కత్తితో పొడిచి చంపాడు
ఆగస్టు 17, 2026

ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



