త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anantapur | మా అత్త చనిపోయేలా చూడు స్వామీ.. క‌రెన్సీ నోటుపై వింత కోరిక

Anantapur | పిల్ల‌నిచ్చిన అత్త‌ల‌పై అల్లుళ్ల‌కు, త‌మ మొగుడి అమ్మ‌ల‌పై కోడ‌ళ్ల‌కు స‌హ‌జంగానే కోపం ఉంటుంది. ఏదో ఒక సంద‌ర్భంలో అత్త‌ల‌పై అల్లుళ్లు రుస‌రుస‌లాడుతూనే ఉంటారు. కోడ‌ళ్లు కూడా అత్త‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉంటుంటారు. అయితే అల్లుడో, కోడ‌లో తెలియ‌దు కానీ.. త‌మ‌ అత్త‌ను ప్ర‌త్య‌క్షంగా ఏం అన‌లేక‌.. దేవుడిని వింత కోరిక కోరారు.

S

National | Published On Jun 19, 2026, 3.03 pm IST

Anantapur | మా అత్త చనిపోయేలా చూడు స్వామీ.. క‌రెన్సీ నోటుపై వింత కోరిక
Advertisement

Anantapur | త్రినేత్ర‌.న్యూస్ : పిల్ల‌నిచ్చిన అత్త‌ల‌పై అల్లుళ్ల‌కు, త‌మ మొగుడి అమ్మ‌ల‌పై కోడ‌ళ్ల‌కు స‌హ‌జంగానే కోపం ఉంటుంది. ఏదో ఒక సంద‌ర్భంలో అత్త‌ల‌పై అల్లుళ్లు రుస‌రుస‌లాడుతూనే ఉంటారు. కోడ‌ళ్లు కూడా అత్త‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉంటుంటారు. అయితే అల్లుడో, కోడ‌లో తెలియ‌దు కానీ.. త‌మ‌ అత్త‌ను ప్ర‌త్య‌క్షంగా ఏం అన‌లేక‌.. దేవుడిని వింత కోరిక కోరారు. మా అత్త త్వ‌ర‌గా చ‌నిపోయేలా చూడు స్వామీ అని హుండీలో వేసిన క‌రెన్సీ నోటుపై రాసి ఉంచారు. ఈ సంఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో వెలుగుచూసింది.

అనంత‌పురం జిల్లా ఆత్మ‌కూరు మండ‌లం పంప‌నూరు సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి ఆల‌యంలో హుండీ కానుక‌లు లెక్కిస్తుండ‌గా.. రూ. 20 నోటును చూసి ఆల‌య అర్చ‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. దానిపై ఓ భ‌క్తుడు లేదా భ‌క్తురాలు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాసి వింత కోరిక కోరారు. స్వామీ మా అత్త వేధింపులు త‌ట్టుకోలేక‌పోతున్నాను.. ఆమె త్వ‌ర‌గా చ‌నిపోయేలా చూడు అని రాశారు. ప్ర‌స్తుతం ఈ కరెన్సీ నోటు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంది.

Advertisement
Advertisement