Sleeping Pills | 20 నిద్ర మాత్రలిచ్చి భర్తను చంపి.. బాత్రూమ్‌లో పూడ్చిపెట్టిన భార్య
Sleeping Pills | ఓ భార్య దారుణానికి పాల్పడ్డింది. కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా చంపింది. 20 నిద్ర మాత్రలు ఇచ్చి హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూమ్‌లో పూడ్చిపెట్టింది.
Sleeping Pills | త్రినేత్ర.న్యూస్ : ఓ భార్య దారుణానికి పాల్పడ్డింది. కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా చంపింది. 20 నిద్ర మాత్రలు ఇచ్చి హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూమ్‌లో పూడ్చిపెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన రూబీ శర్మ, సురేంద్ర శర్మ దంపతులకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. ఇరువురి మధ్య ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా భర్తను హత్య చేయాలని రూబీ నిర్ణయించుకుంది. దీంతో భర్తకు 20 వరకు నిద్ర మాత్రలు ఆహారంలో కలిపి ఇచ్చింది. స్పృహ కోల్పోయిన అనంతరం సురేంద్రను హత్య చేసింది. ఆ తర్వాత బాత్రూమ్‌లోనే భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది.
45 రోజుల తర్వాత..
సురేంద్ర కనిపించడం లేదని బంధువులు, ఇరుగుపొరుగు వారు అడిగినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్లాడు త్వరలోనే తిరిగి వస్తాడని రూబీ శర్మ నమ్మబలికేది. కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. 45 రోజుల తర్వాత తనకేమీ తెలియనట్లు రూబీ శర్మ.. సురేంద్ర సోదరుడు అనిల్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 18 నుంచి కనిపించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేరాన్ని అంగీకరించిన రూబీ శర్మ
సురేంద్ర సోదరుడు అనిల్‌కు రూబీ శర్మపైనే అనుమానం కలిగింది. కానీ తనకేమీ తెలియనట్లు పోలీసులు, బంధువుల ముందు నటించేది. అప్పుడప్పుడూ కన్నీరు కూడా పెట్టుకునేది. అయితే రూబీని పోలీసులు ప్రశ్నించినట్లు.. ఆమె వింతగా ప్రవర్తిస్తూ సమాధానం చెప్పేది. మొత్తానికి పోలీసుల విచారణలో రూబీ శర్మ నేరాన్ని అంగీకరించింది.
కోర్టుకు తిరగాల్సి వస్తుందేమోనన్న భయంతో..
అయితే సురేంద్ర మద్యం సేవించి బంధువులతో గొడవపడ్డాడు. ఆ తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటారని, కోర్టుకు తిరగాల్సి వస్తుందేమోనన్న భయంతో భర్తను చంపినట్లు రూబీ శర్మ పేర్కొన్నారు. భర్తను చంపిన తర్వాత.. బాత్రూమ్‌లోనే పూడ్చిపెట్టింది రూబీ శర్మ. మరుసటి రోజు కూలీలను పిలిపించి మట్టితో చదును చేయించింది. ఇక మేస్త్రీని తీసుకొచ్చి కాంక్రీట్‌తో ఆ భాగాన్ని పూర్తిగా కాంక్రీట్ ఫ్లోర్‌గా మార్చేసింది. చివరకు పోలీసులు కాంక్రీట్‌ను తొలగించి డెడ్‌బాడీని బయటకు వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
- ●Instagram CSAM Ads | ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం కొరడా.. ఆ అసభ్యకరమైన యాడ్స్ ఏంటి? మెటాకు 7 రోజుల డెడ్‌లైన్!
- ●E20 Petrol India | ఇండియా E20 పెట్రోల్‌ను భూటాన్ నిజంగానే రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- ●Teejan Bai | తీజన్ బాయి ఇకలేరు.. మూగబోయిన జానపద లోకం
- ●Aakriti Sutar Case | విషాదం: పెళ్లైన రెండు నెలలకే భవనం పైనుంచి పడి యువతి మృతి.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు
- ●Rajagopal Reddy | రాహుల్ మాటలకు ఫిదా అయ్యా.. ఆయన నాయకత్వంలోనే పని చేస్తున్నా
- ●Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!

Instagram CSAM Ads | ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం కొరడా.. ఆ అసభ్యకరమైన యాడ్స్ ఏంటి? మెటాకు 7 రోజుల డెడ్‌లైన్!

E20 Petrol India | ఇండియా E20 పెట్రోల్‌ను భూటాన్ నిజంగానే రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Teejan Bai | తీజన్ బాయి ఇకలేరు.. మూగబోయిన జానపద లోకం

Aakriti Sutar Case | విషాదం: పెళ్లైన రెండు నెలలకే భవనం పైనుంచి పడి యువతి మృతి.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు






