Kondigari Ramulu | రెండుసార్లు ఎమ్మెల్యే.. అయినా సాధారణ జీవితం..
Kondigari Ramulu | సీపీఎం సీనియర్ నాయకుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (Kondigari Ramulu) కన్నుమూశారు. 91 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మార్చి 13న ఉదయం 8.45 గంటలకు ఇబ్రహీంపట్నం లోని తన ఇంట్లో మృతి చెందారు.
Kondigari Ramulu | త్రినేత్ర.న్యూస్: సీపీఎం సీనియర్ నాయకుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (Kondigari Ramulu) కన్నుమూశారు. 91 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మార్చి 13న ఉదయం 8.45 గంటలకు ఇబ్రహీంపట్నం లోని తన ఇంట్లో మృతి చెందారు. 1989, 1994లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత నిజాయితీ గల ప్రజాప్రతినిధిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన నికార్సైన కమ్యూనిస్టు ఉద్యమ నేతగా, నిస్వార్ధ నాయకుడిగా కొండిగారి రాములు పెరుపొందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికి ఆర్థికంగా సాధారణ జీవితం గడిపారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
1935లో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో జన్మించారు. చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, ఎలాంటి ఆస్తిపాస్తులు కూడబెట్టకోకుండా సామాన్య జీవితం గడిపిన అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు. స్వగ్రామం ఆరుట్ల అయినప్పటికీ ఇబ్రహీంపట్నంలోని బృందావన్ కాలనీలో స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు అనారోగ్య కారణాలతో గతంలోనే మృతిచెందారు. మూడో కుమారుడైన త్రిలోక్ కుమార్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్రహీపట్నం 12వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు.
ఇవికూడా చదవండి..
విజయ్ విడాకుల వివాదం - చిరంజీవి విశ్వంభర ప్రమోషన్స్‌కు త్రిష దూరం
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారులకు అవకాశమా..?
కొవిడ్ తరహాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మనం అధిగమిస్తాం : ప్రధాని మోదీ
సన్ రైజర్స్ యాజమాన్యానికి షాక్.. పాక్ ప్లేయర్‌ను కొన్న అనంతరం ఎక్స్ ఖాతా సస్పెన్షన్..
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






