Trisha | విజయ్ విడాకుల వివాదం – చిరంజీవి విశ్వంభర ప్రమోషన్స్‌కు త్రిష దూరం
విజయ్, సంగీత విడాకులకు త్రిషనే కారణమంటూ గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. విడాకుల వ్యవహారంతో పాటు వివాదాల కారణంగా చిరంజీవి విశ్వంభర ప్రమోషన్స్‌కు త్రిష దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అంటున్నారు.
Entertainment | Published On Mar 13, 2026, 10.57 am IST
Trisha | దళపతి విజయ్, సంగీత విడాకుల వ్యవహారం కారణంగా గత కొద్ది రోజులుగా త్రిష పేరు కోలీవుడ్‌లో మారుమోగుతోంది. విజయ్, సంగీత విడాకులకు త్రిషనే కారణమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. భర్త నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత రోజే విజయ్, త్రిష ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించారు. దాంతో విజయ్, త్రిష మధ్య ఉన్న బంధంపై రకరకాల పుకార్లు మొదలయ్యాయి. విజయ్, త్రిష పెళ్లి చేసుకోనున్నారని కొందరు చెబుతోన్నారు. సినిమాలకు గుడ్‌బై చెప్పి విజయ్ టీవీకే పార్టీ నుంచి త్రిష ఎన్నికల్లో పోటీ చేయనుందని అంటున్నారు. ఈ రూమర్లపై మాత్రం అటు విజయ్‌తో పాటు ఇటు త్రిష రియాక్ట్ కావడం లేదు.
త్రిషపై ట్రోలింగ్...
విజయ్ విడాకుల కేసు విషయంలో త్రిషపై గత కొద్ది రోజులుగా దారుణంగా ట్రోలింగ్ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్ ముంగిట ఈ బంధం బయటపడటంతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా త్రిషపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదాలు, ట్రోలింగ్ నేపథ్యంలో తన అప్‌కమింగ్ మూవీస్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని త్రిష నిర్ణయించుకుందట.
విశ్వంభర ప్రమోషన్స్...
త్రిష హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ విశ్వంభరతో పాటు తమిళ మూవీ కరుప్పు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. విశ్వంభరలో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత విశ్వంభరతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది ఈ చెన్నై క్వీన్. స్టాలిన్ అనంతరం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీని జూన్ లేదా జూలైలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇటీవలే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే లేటెస్ట్ కాంట్రవర్సీల కారణంగా విశ్వంభర ప్రమోషన్స్‌కు అటెండ్ కాకూడదని త్రిష ఫిక్సయ్యిందట. విశ్వంభరతో పాటు సూర్య కరుప్పు మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కనిపించకూడదని త్రిష నిర్ణయించుకుందట. ప్రమోషన్స్‌లో పాల్గొంటే ఆ సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితాన్ని హైలైట్ చేసే అవకాశం ఉండటంతోనే అవసరపు వివాదాలను కొనితెచ్చుకోకూదనే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు.
విడాకుల వివాదం కారణంగా కొన్నాళ్ల పాటు కొత్త సినిమాలను కూడా అంగీకరించకూడదని అనుకుంటున్నదట. కొన్ని తమిళ సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసినట్లు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి






