Kyama Mallesh | ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డా? కచ్చితంగా అడ్డుకుంటం
Kyama Mallesh | స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరికాదని బీఆర్ఎస్ లీడర్ క్యామ మల్లేష్ మండిపడ్డారు. అక్కడ డంపింగ్ యార్డు పెడితే ప్రజల తరఫున కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
- మూసీ పక్కనే డంపింగ్‌యార్డు పెడితే మురుగంతా మూసీలనే కలుస్తది
- ఇగ ప్రక్షాళన చేసి ఏం లాభం?
- సీఎం, మంత్రులు పనికిరాని ఆలోచనలు చేస్తున్నరు
- కమీషన్ల కోసమే 494 ఎకరాల విలువైన భూమి కేటాయించారు
- ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీకి కండ్లు కనిపిస్తలేవా
- మీడియా సమావేశంలో క్యామ మల్లేష్ ఆగ్రహం
Kyama Mallesh | త్రినేత్ర.న్యూస్: స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరికాదని బీఆర్ఎస్ లీడర్ క్యామ మల్లేష్ మండిపడ్డారు. పైగా జపాన్ కంపెనీకి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన 494 ఎకరాల భూమిలో డంపింగ్ యార్డు బదులుగా ఐటీ కంపెనీలు పెట్టాలని సూచించారు. అక్కడ డంపింగ్ యార్డు పెడితే ప్రజల తరఫున కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే రంగారెడ్డి జిల్లాలో డంపింగ్ యార్డు పెడితే ప్రజల వ్యతిరేకత తప్పదు. కమీషన్ల కోసం 494 ఎకరాలు ఎకో టౌన్ పేరుతో డంపింగ్‌యార్డ్‌కు కేటాయించారు. ఇబ్రాహీంపట్నం పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కళ్లు కన్పించడం లేదా? కమీషన్ల కోసం నోరు విప్పడం లేదా? మూసీ పక్కనే డంపింగ్ యార్డు పెడితే వర్షానికి మురుగు నీరు మూసీలోకి పోతుంది. సీఎం రేవంత్ ఇక మూసీని ఏం ప్రక్షాళన చేస్తారు అని మల్లేశ్ నిలదీశారు.
ఆర్ఆర్ఆర్ లోపల డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం పెరుగుతుంది. సీఎం, మంత్రులు అనాలోచిత నిర్ణయాలు ప్రజలకి శాపంగా మారుతున్నాయి. రాష్ట్రానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే రంగారెడ్డి జిల్లాలో డంపింగ్‌యార్డు పెడితే ప్రజల వ్యతిరేకత తప్పదు. మూసీ ప్రాజెక్టును మేం వ్యతిరేకించడం లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే డంపింగ్‌యార్డ్‌ను అడ్డుకోకుంటే ఆయనకు బుద్ధి చెప్తాం. డంపింగ్‌యార్డ్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తరఫున ఎంతవరకైనా పోరాటం చేస్తాం అని క్యామ మల్లేశ్ తేల్చి చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
సెప్టెంబర్ 22, 2026

Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో
సెప్టెంబర్ 22, 2026

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



