PM Modi | కొవిడ్ తరహాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మనం అధిగమిస్తాం : ప్రధాని మోదీ
PM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ (Covid) మహమ్మారి సమయంలో మాదిరిగానే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల తలెత్తిన ఎల్పీజీ సంక్షోభాన్ని (LPG crisis) భారత్ అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
PM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ (Covid) మహమ్మారి సమయంలో మాదిరిగానే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల తలెత్తిన ఎల్పీజీ సంక్షోభాన్ని (LPG crisis) భారత్ అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు, అంతరాయాల భారాన్ని భారతీయులపై పడకుండా చూసేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాలతో పనిచేస్తోందని చెప్పారు. ఈ మేరకు గురువారం NXT సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
"140 కోట్ల మంది భారతీయులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కొవిడ్ మహమ్మారి సమయం మాదిరిగానే మనం ఈ సంక్షోభాన్ని కూడా అధిగమిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల మన పౌరులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకూడదనేదే మా స్పష్టమైన సంకల్పం" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్‌మార్కెట్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిస్థితిని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడే వారిని అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని కోరారు. నిఘాను పెంచాలని సూచించారు.
ఇంధన భద్రతను కాపాడుకునేందుకు చర్యలు..
ఇక పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని తెలిపారు. ఇంధన సంక్షోభానికి దారితీసిందని వ్యాఖ్యానించారు. భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. గ్లోబల్ లీడర్స్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.
భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది..
2014కు ముందు దేశంలో ఇథనాల్ (Ethanol blending) సామర్థ్యం కేవలం 1-1.5 శాతం మాత్రమే ఉండేదని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అది నేడు 20 శాతానికి చేరిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తే సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారత్ తన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను, ఇంధన మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు సుమారు 50 లక్షల టన్నులకు పైగా ఉన్నాయని, అలాగే 2014లో 14 కోట్లుగా ఉన్న ఎల్పీజీ (LPG) కనెక్షన్ల సంఖ్య ఇప్పుడు 33 కోట్లకు పెరిగిందని ప్రధాని వివరించారు. గత దశాబ్ద కాలంలో దేశంలో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లు, ఎల్‌ఎన్‌జీ (LNG) టెర్మినల్స్, ఎల్పీజీ పంపిణీ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించినట్లు గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా ముందుకు సాగుతోందని, ప్రపంచ వృద్ధికి కీలక చోదక శక్తిగా నిలుస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
Also Read..
US Aircraft Crash | అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. ఇరాక్‌లో కుప్పకూలిన సైనిక విమానం
సంబంధిత వార్తలు

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
ఆగస్టు 18, 2026

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



