Work From Bike | బైక్‌పై ల్యాప్‌టాప్‌తో యువకుడి ప్రయాణం.. తీవ్రంగా స్పందించిన సజ్జనార్
Work From Bike | హైదరాబాద్ (Hyderabad)లో ఓ ఐటీ ఉద్యోగికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ యువకుడు రాత్రి సమయంలో మాదాపూర్ ఐటీ కారిడార్ (Madhapur IT corridor)లోని హైటెక్ సిటీ (HITEC City) ప్రాంతంలో బైక్‌పై వెళ్తూ కనిపించాడు.
Work From Bike | హైదరాబాద్ (Hyderabad)లో ఓ ఐటీ ఉద్యోగికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ యువకుడు రాత్రి సమయంలో మాదాపూర్ ఐటీ కారిడార్ (Madhapur IT corridor)లోని హైటెక్ సిటీ (HITEC City) ప్రాంతంలో బైక్‌పై వెళ్తూ కనిపించాడు. అయితే, అతడు ఆ సమయంలో బైక్ ముందు భాగంలో ల్యాప్‌టాప్ (Work From Bike) పెట్టుకుని వేగంగా వెళ్తూ కనిపించాడు.
అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో హైదరాబాద్ వాసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది రోడ్డు భద్రత (road safety)పై, అలాగే శృతిమించుతున్న కార్పొరేట్ సంస్కృతిపై (work-life balance) తీవ్ర చర్చకు దారితీస్తోంది. పలువురు నెటిజన్లు ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. “వర్క్ ఫ్రమ్ బైక్”, “కార్పొరేట్ పని సంస్కృతికి పరాకాష్ట” అని అభివర్ణిస్తున్నారు. మరికొందరు కార్పొరేట్ సంస్థల్లో పని ఒత్తిడిపై కామెంట్లు చేస్తున్నారు.
కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు..
ఇక ఈ వీడియోపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (V.C. Sajjanar) కూడా తనదైన శైలిలో స్పందించారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు.. పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ సజ్జనార్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.
రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా… pic.twitter.com/qSTFaFvf3w
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 13, 2026
Also Read..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్





