PM Modi | విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ.. వారితో చర్చల కోసం ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. వారం రోజుల పర్యటనలో భాగంగా తొలుత ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే జీ7 (G7) సదస్సులో పాల్గొననున్నారు. ఆ తర్వాత స్లోవేకియా వెళ్లనున్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాన మంత్రి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో వారం రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఫ్రాన్స్‌లో జరిగే జీ7 (G7) సదస్సులో పాల్గొనడంతో పాటు పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.
విదేశీ పర్యటనకు బయల్దేరడానికి ముందు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. భారతదేశ వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్ (France)కు ప్రత్యేక స్థానం ఉందని అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌ను సందర్శించిన సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలను 'స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్' స్థాయికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పర్యటనలోనూ మాక్రాన్‌తో భేటీ కానున్నట్లు ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో మాక్రాన్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
స్లోవేకియాలో భారత ప్రధాని తొలి పర్యటన..
ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని స్లోవేకియా వెళ్లనున్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాన మంత్రి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి అని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటన ఓ చారిత్రాత్మక మైలురాయి అని, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బ్రాటిస్లావాలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికోలతో చర్చలు జరిపేందుకు తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
Also Read..
నౌకలపై దాడులు సమంజసం కాదు.. నావికుల మృతిపై భారత్ నిరసన
అస్సాంలో కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్.. పైలట్ మృతి..!
సీపీఐ నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం.. జీవిత సంపాదనంతా విరాళమిస్తున్నట్లు ప్రకటన
సంబంధిత వార్తలు

MLA Naveen Yadav | బీసీల లెక్కలు తేలాల్సిందే : ఎమ్మెల్యే నవీన్ యాదవ్
అక్టోబర్ 2, 2026

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
అక్టోబర్ 2, 2026

Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్



