Hyderabad | గాలి వాన బీభత్సం.. కరెంట్ షాక్‌తో తండ్రీకూతురు మృతి
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నగరంలోని పలుచోట్ల భారీ ఈదురుగాలులు వీచడంతో.. భారీ వృక్షాలు నేలకొరిగాయి.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నగరంలోని పలుచోట్ల భారీ ఈదురుగాలులు వీచడంతో.. భారీ వృక్షాలు నేలకొరిగాయి. మేడ్చల్ జిల్లా అల్వాల్ టెలికాం కాలనీలో గాలివానకు ఓ చెట్టు కొమ్మలు కారుపై విరిగిపడ్డాయి.
కారుపై పడ్డ చెట్టు కొమ్మలను తొలగించేందుకు దాని యజమాని సందీప్(44), కూతురు రితిక(16) శనివారం ఉదయం ప్రయత్నించారు. అయితే ఆ చెట్టు కొమ్మల మధ్య ఉన్న విద్యుత్ తీగలను తండ్రీకూతుళ్లు గమనించలేదు. చెట్టు కొమ్మలను ముట్టుకోగానే విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సందీప్ భార్య శ్వేతకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్






