త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Rains | తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో ఉరుములు, పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అదేవిధంగా జూన్ 10-14 మ‌ధ్య రుతుప‌వ‌నాలు రాష్ట్రంలోకి ప్ర‌వేశిస్తాయ‌ని వెల్ల‌డించింది.

D

Telangana | Published On Jun 4, 2026, 2.53 pm IST

Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు
Advertisement

Rains | తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో ఉరుములు, పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాబోయే రెండు గంట‌ల్లో ఆదిలాబాద్‌, జ‌న‌గాం, సిద్ధిపేట‌, మెద‌క్, కామారెడ్డి, సిరిసిల్ల‌, ఆసిఫాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్‌, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన‌ అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. అదేవిధంగా సంగారెడ్డి (నారాయణ్‌ఖేడ్), వికారాబాద్‌, న‌ల్గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, నిజామాబాద్‌, నిర్మ‌ల్‌, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా తీవ్ర‌మైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

జూన్ 10 నాటికి తెలంగాణ‌కు రుతుప‌వ‌నాలు

ఇదిలా ఉండ‌గా.. తీవ్ర‌మైన ఎండ‌లు, ఉక్క‌పోత‌తో అల్లాడిపోతున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఊర‌ట‌నిచ్చే వార్త చెప్పింది. ఈనెల 10 నాటికి నైరుతి రుతుప‌వ‌నాలు (Monsoon2026) రాష్ట్రంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. జూన్ 10-14 మ‌ధ్య రుతుప‌వ‌నాలు రాష్ట్రంలోకి ప్ర‌వేశిస్తాయ‌ని వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

Also Read..

సీఎం రేవంత్ ఎడిపోయిన ప్రాజెక్టులు చూడ్డానికి వ‌స్తున్న‌డు: శ్రీ‌నివాస్ గౌడ్ ఎద్దేవా

ఢిల్లీ అగ్నిప్ర‌మాదం.. షార్ట్ స‌ర్క్యూటే కార‌ణం..!

దీదీకి బిగ్ షాక్! బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు?

Advertisement
Advertisement