త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్ర‌మాదం.. షార్ట్ స‌ర్క్యూటే కార‌ణం..!

Delhi Hotel Fire | ఢిల్లీలోని మాల‌వీయ న‌గ‌ర్ (Malviya Nagar)లో బుధ‌వారం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన (Delhi Hotel Fire) విష‌యం తెలిసిందే. షార్ట్ స‌ర్క్యూట్ (Short Circuit) వ‌ల్లే ప్ర‌మాదం సంభ‌వించి ఉండొచ్చ‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.

D

National | Published On Jun 4, 2026, 2.25 pm IST

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్ర‌మాదం.. షార్ట్ స‌ర్క్యూటే కార‌ణం..!
Advertisement

Delhi Hotel Fire | ఢిల్లీలోని మాల‌వీయ న‌గ‌ర్ (Malviya Nagar)లో బుధ‌వారం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన (Delhi Hotel Fire) విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న‌లో 21 మంది స‌జీవ ద‌హ‌న‌మయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ (Short Circuit) వ‌ల్లే ప్ర‌మాదం సంభ‌వించి ఉండొచ్చ‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. ఈ మేర‌కు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. భ‌వ‌నంలో వైరింగ్‌లో లోపాలే ప్ర‌మాదానికి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని పేర్కొంటున్నాయి.

అంతేకాదు, ద‌ర్యాప్తులో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ భ‌వ‌నంలో మొత్తం 25 గ‌దులు ఉన్నాయి. అయితే, లోప‌లికి వెళ్లేందుకు, బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఒకే రూట్ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక కిటికీల‌న్నీ సీల్ చేసి ఉన్నాయి. ఏదైనా ప్ర‌మాదం జరిగితే కిటికీల ద్వారా బ‌య‌ట‌కు త‌ప్పించుకునే ఆస్కారం లేదు. దీనికి తోడు మెయిన్ డోర్ మొత్తం సెన్సార్‌తో ప‌నిచేసేది కావ‌డం గ‌మ‌నార్హం.

రెండు కిచెన్‌లు..

ఈ భ‌వ‌నంలో రెండు కిచెన్‌లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. బేస్‌మెంట్‌, పై అంత‌స్తుల్లో అవి ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ఈ రెండు కిచెన్స్‌లో ఎల్పీజీ సిలిండ‌ర్ల‌ను నిల్వ చేసిన‌ట్లు గుర్తించారు. అయితే, ఈ సిలిండ‌ర్ల వ‌ల్ల సంభ‌వించిన ప్ర‌మాదం కాద‌ని పోలీసులు ద‌ర్యాప్తులో గుర్తించారు.

రూమ్స్‌లో ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాలు..

ఇక త‌నిఖీల స‌మ‌యంలో ప‌లు గ‌దుల్లో ఎల‌క్ట్రిక్ స్ట‌వ్‌లు, ఇత‌ర ప‌రిక‌రాల‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌లో ఎక్కువ రోజులు బస చేస్తున్న అతిథులు తమ భోజనం వండుకోవడానికి ఈ పరికరాలను ఉపయోగిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నే..

దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి (Hauz Rani) ప్రాంతంలో అత్యంత ర‌ద్దీగా ఉండే ఏరియాలో ఈ 'ఫ్లోరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్' (Flourish Stay B&B) హెట‌ల్ ఉంది. హోటల్ ఒక మృత్యుకూపమని, నిబంధనలను గాలికి వదిలేసి అక్రమంగా నడిపిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం ఈ అనుమతితో కేవలం 6 గదులు మాత్రమే నిర్వహించాలి. కానీ, బేస్‌మెంట్‌తో కలుపుకుని ఏకంగా 25 రూమ్స్ నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనే 21 మంది ప్రాణాలు కోల్పోవ‌డానికి ప్రధాన కారణమైంది.

Also Read..

భార‌త్‌కు చేరిన ఎస్‌-400 నాలుగో యూనిట్.. ఇక మ‌న‌ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత ప‌టిష్టం

పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!

పాత‌బ‌స్తీలో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించాను : కేటీఆర్

Advertisement
Advertisement