Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ఆస్తి రాసిచ్చాక వృద్ధ తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకుకి బాంబే హైకోర్టు దిమ్మతిరిగే తీర్పునిచ్చింది. గిఫ్ట్ డీడ్‌ను క్యాన్సిల్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
సంక్షిప్త సారాంశం
ముంబైలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోని ఓ కొడుకుకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆ తల్లిదండ్రులు బహుమతిగా (గిఫ్ట్ డీడ్) ఇచ్చిన రెండు ఫ్లాట్లను వెంటనే ఖాళీ చేయాలని కొడుకును ఆదేశించింది. 68 ఏళ్ల రమేష్ సోని 2023లో తన కొడుకుకు ఆస్తిని రాసిస్తూ, వృద్ధాప్యంలో తమను బాగా చూసుకోవాలనే కండిషన్ పెట్టాడు. దీన్ని ఉల్లంఘించినందున, సీనియర్ సిటిజన్స్ చట్టం సెక్షన్ 23 ప్రకారం ఈ ఆస్తి బదిలీని రద్దు చేస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
Senior Citizen Property Rights India | త్రినేత్ర.న్యూస్ : ముంబైలో ఓ ఆసక్తికరమైన, అందరికీ గుణపాఠం లాంటి సంఘటన జరిగింది. ఆస్తి తన పేర రాసిచ్చిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గాలికి వదిలేసిన ఓ కొడుక్కి బాంబే హైకోర్టు (Bombay High Court) గట్టి బుద్ధి చెప్పింది. తండ్రి బహుమతిగా ఇచ్చిన రెండు ఫ్లాట్లను వెంటనే ఖాళీ చేయాలంటూ సంచలన తీర్పునిచ్చింది.
అసలేం జరిగిందంటే..
68 ఏళ్ల వయసున్న రమేష్ బచౌలాల్ సోని.. 2023లో తన కొడుకు పేరు మీద లోయర్ పరేల్‌లోని ఓ ఫ్లాట్, బైకల్లాలోని మరో ఫ్లాట్‌లో కొంత భాగాన్ని గిఫ్ట్ డీడ్ (Gift deed) కింద రిజిస్టర్ చేశాడు. వయసు మీద పడిన తర్వాత తనను, తన భార్యను బాగా చూసుకోవాలనే కండిషన్‌తోనే అతను ఈ ఆస్తిని కొడుక్కి ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్లలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు.
అయితే, ఆస్తి చేతికొచ్చాక కొడుకు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తల్లిదండ్రులతో బంధం దెబ్బతింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. ఆ వృద్ధ దంపతులు తమ సొంత ఇల్లు వదిలేసి బయటకు రావాల్సి వచ్చింది. బైకల్లాలోని ఫ్లాట్ నిర్మాణం పూర్తికాకపోవడంతో వారికి తలదాచుకునేందుకు కనీసం సరైన ఇల్లు కూడా లేకుండా పోయింది.
కోర్టు మెట్లెక్కిన పేరెంట్స్
దీంతో న్యాయం కోసం వారు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. లోయర్ పరేల్ ఫ్లాట్ గిఫ్ట్ డీడ్‌ను క్యాన్సిల్ చేస్తూ, 60 రోజుల్లోగా ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేయాలని కొడుకును ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ కొడుకు బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఆ ఫ్లాట్‌ను వాస్తవానికి తానే కొన్నానని.. తన తండ్రి కేవలం యజమానిగా తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడని వాదించాడు.
కానీ, ఈ వాదనను న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది. సరైన డాక్యుమెంట్ ఆధారాలు లేకుండా నోటి మాటతో చెబితే కుదరదని.. గిఫ్ట్ డీడ్‌లో ఉన్న లిఖితపూర్వక షరతులకు ఇది విరుద్ధమని స్పష్టం చేసింది.
సెక్షన్ 23 ఏం చెబుతోంది?
సెక్షన్ 23 చట్టం ప్రకారం.. కండిషనల్ గిఫ్ట్ డీడ్ రాసిచ్చినప్పుడు.. అందులోని షరతులను (తల్లిదండ్రులను చూసుకోవడం) ఉల్లంఘిస్తే ఆస్తి బదిలీని రద్దు చేసే హక్కు వృద్ధులకు ఉంటుందని అడ్వకేట్ సృష్టి షా ద్వారా కోర్టు తేల్చి చెప్పింది. తండ్రికి జ్యువెలరీ బిజినెస్ ఉందని, ఆర్థికంగా స్థిరంగా ఉన్నాడన్న కొడుకు వాదనను సైతం కోర్టు కొట్టివేసింది. ఫైనాన్షియల్ స్టేటస్‌తో ఈ చట్టానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.
తన సోదరీమణుల మాటలు విని.. వాళ్లు చెబితనే, తండ్రి ఈ కేసు వేశాడన్న కొడుకు ఆరోపణలను కూడా న్యాయమూర్తులు పక్కనబెట్టారు. చివర్లో, తల్లిదండ్రులకు లోయర్ పరేల్ ఫ్లాట్‌లో ఉండటానికి చోటు ఇస్తానని కొడుకు కాంప్రమైజ్‌కు (compromise) ప్రయత్నించినా కోర్టు అంగీకరించలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెబుతూ, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తప్పక అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
కండిషనల్ గిఫ్ట్ డీడ్ (Conditional Gift Deed) అంటే ఏంటి?
కొన్ని నిర్దిష్ట షరతులతో కూడి ఆస్తిని బదిలీ చేయడాన్ని కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటారు.
ఆస్తి తీసుకున్న వ్యక్తి ఆ గిఫ్ట్‌ను అంగీకరించి, అందులోని షరతులను తప్పక పాటించాలి.
ఒకవేళ షరతులను నెరవేర్చడంలో విఫలమైతే, ఆస్తి ఇచ్చిన వారు ఆ బదిలీని రద్దు (revoke) చేసుకునే హక్కు ఉంటుంది.
ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ (Transfer of Property Act) సెక్షన్ 126 ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీనిని రద్దు చేయవచ్చు. అయితే, అది కేవలం ఆస్తి ఇచ్చిన వ్యక్తి ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉండదు.
ఈ డాక్యుమెంట్‌కు కచ్చితంగా రిజిస్ట్రేషన్, స్టాంపింగ్ అవసరం. సాధారణంగా ఆస్తి వినియోగంపై పరిమితులు విధించడం లేదా ఆస్తి ఇచ్చిన వారిని పోషించాలనే షరతులు ఇందులో ఉంటాయి.
తాజావార్తలు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!



